Chandrababu-Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కామెంట్లను జగన్ వింటారా?

Chandrababu-Pawan Kalyan: ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఏపీలో జీవో నెంబర్ 1ని ప్రభుత్వం తీసుకురాగా.. ఇది ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీల నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాగా.. ఏపీలో కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 1ని వ్యతిరేకించడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలపై ఇద్దరు నేతలు దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.

 

చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. అలాగే మాట్లాడుతూ.. ‘బ్రిటిష్‌ వాళ్లు తెచ్చిన జీవో నెం.1తో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకూడదనే జీవో నెం.1 తెచ్చారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధమన్నారు.. జగన్‌ బర్త్‌డేకు అవే వాడారు. వైసీపీకి ఒక రూల్‌.. ప్రతిపక్షాలకు మరొక రూలా? ఇరిగేషన్‌ మంత్రికి పోలవరం గురించే తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలుసు. అందుకే కేసులు, గొడవలు, కుట్రలతో వైసీపీ విశ్వరూపం చూపిస్తోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్నా’ అని పవన్ అన్నారు.

 

అటు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘జీవో నెం.1 తీసుకొచ్చి ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జరగరానిది జరుగుతోంది. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్‌ను హింసించారు. ఇప్పటంలో పవన్‌ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చేశారు. విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారు. జీవో నెం.1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశాం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కుప్పం వెళ్తానంటే అడ్డంకులు సృష్టించారు. వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా? కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతాం’ అని అన్నారు.

 

కాగా కందుకూరు మరియు గుంటూరు ఘటనల్లో పలువురు మరణించడంతో ప్రభుత్వం జీవో నెంబర్ 1 పేరుతో బహిరంగ ప్రదేశాలైన రోడ్లు, కూడళ్లు లాంటి ప్రాంతాల్లో జనాలు గుమిగూడేలా ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టకుండా నిషేధం విధించారు. అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగానే జగన్ సర్కార్ ఇలాంటి జీవోను తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇస్తున్న వార్నింగ్ లను జగన్ పట్టించుకుంటారా? జీవో నెంబర్ 1 మీద వెనక్కి తగ్గుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ సర్కిల్స్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -