Rajamouli: జక్కన్న మహాభారతంలో ద్రౌపది రోల్ లో ఆమె నటించనున్నారా?

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా రాజమౌళి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.ఒక సీరియల్ డైరెక్టర్ గా బుల్లితెరపై కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి ఇండస్ట్రీలోకి వెను తిరిగి చూసుకోలేదు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా రావడంతో ఈయన ప్రతిభ ఎలాంటిదో అర్థం అవుతుంది. ఇలా రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఈయనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని, ఎప్పటికైనా ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తానని చెబుతూ వస్తున్నారు.

 

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటీ అనే విషయానికి వస్తే ఇప్పటికైనా ఈయన మహాభారతం చేయడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు.మహాభారతాన్ని దాదాపు పది భాగాలుగా చేస్తాను అంటూ రాజమౌళి చెప్పడంతో పలువురు అభిమానులు ఈ సినిమాపై తమదైన శైలిలో కామెంట్లు చేయడమే కాకుండా ఈ మహాభారతం సినిమాలో ఏ హీరో ఏ పాత్రకు సెట్ అవుతారనే విషయం గురించి ఒక నెటిజన్ ఒక వీడియో రూపంలో తయారు చేశారు.

 

మహేష్ బాబుని కృష్ణుడిగా, ప్రభాస్ ని కర్ణుడిగా, జూనియర్ ఎన్టీఆర్ ని భీముడిగా, రానాని దుర్యోధనుడిగా, పవన్ కళ్యాణ్ ని ధర్మరాజుగా, రామ్ చరణ్ ని అర్జునుడిగా, బాలకృష్ణని పరశురాముడిగా, అల్లు అర్జున్ ని అశ్వద్ధామగా చిత్రీకరించి వీడియో చేశారు. అయితే మరి కొందరు ద్రౌపతి పాత్రలో ఎవరు నటించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ద్రౌపతి పాత్రలో నటించడానికి ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్ పేరు చెప్పడం విశేషం. మరి రాజమౌళి ఈ సినిమా చేస్తారో లేదో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం ఈ సినిమా చేస్తే ఎలాంటి కీక్ ఉంటుందో భారీగా చర్చలు జరుపుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -