Jr NTR: సినిమాల్లో సక్సెస్ అయిన జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా?

Jr NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది.సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగిన ఎంతో మంది సినీ తారలు రాజకీయాలలోకి వెళ్లి రాజకీయాలలో కూడా తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్, ఎంజీఆర్,జయలలిత వంటి ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోను చక్రం తిప్పారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చారు.ఈ విధంగా అన్నగారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చారంటే ఈయన క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలను నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబునాయుడు చేతుల్లోకి వెళ్లింది.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.ఎన్టీఆర్ తిరిగి రాజకీయాలలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఎంతో మంది భావిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు.గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్ళగా రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ కొనప్రాణాలతో బయటపడ్డారు. అప్పటినుంచి ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నప్పటికీ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఎన్టీఆర్ సినిమాలలో సక్సెస్ అయిన విధంగా రాజకీయాలలో సక్సెస్ కాలేరా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. కానీ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఆయన ఆలోచనలను బట్టి చూస్తే రాజకీయాలలోకి ఎన్టీఆర్ వస్తే తప్పకుండా రాజకీయాలలో కూడా సక్సెస్ అవుతారని చెప్పాలి.అయితే ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపుతారో తెలియదు కానీ ఈయన ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -