Mahesh: ఆ రేర్ రికార్డును మహేష్ సొంతం చేసుకుంటారా?

Mahesh: టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తర్వాత విడుదల అయినా మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కార్ వారి పాట అలాంటి సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. అయితే భరత్ అనే నేను సినిమా తరువాత విడుదలైన ఈ మూడు సినిమాలు కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.

దీంతో మహేష్ అభిమానులు తదుపరి సినిమాలు కూడా అదే విధంగా హిట్ అవుతాయి అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇటీవల మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఈ సినిమా మరొకసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అందుకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అయిపోగానే వెంటనే రాజమౌళి అందుకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అభిమానులు భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలు అన్ని ఏ విధంగా అయితే మంచి సక్సెస్ ను సాధించాయో త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలు కూడా మంచి సక్సెస్ను సాధిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని అయితే ట్రిపుల్ హ్యాట్రిక్ ను కూడా సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -