Minister Satyavati Rathore: చెప్పులు లేకుండా తిరుగుతూ.. మంత్రి సత్యవతి రాథోడ్ శపథం నెరవేరుతుందా?

Minister Satyavati Rathore: రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, శపథాలు కామన్. రోజూ పార్టీలు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉంటాయి. సవాళ్లు, శపథాలు చేసుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీలు, పార్టీల నేతలపై విమర్శలు రావడం సర్వసాధారణం. వాటిని ఖండించే రాజకీయ నేతలు సవాళ్లు చేస్తూ ఉంటారు. నిరూపిస్తే దేనికైనా సిద్దమంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇక తనపై వచ్చే ఆరోపణలకు శపథాలు కూడా చేస్తానంటూ రాజకీయ నేతలు చెబుతూ ఉంటారు. తమపై వచ్చే విమర్శలు, ఆరోపణలకు చెక్ పెడుతూ పార్టీలు, పార్టీల నాయకులు సవాళ్లు, శపథకాలను ప్రయోగిస్తూ ఉంటారు.

తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల శపథాలు హాట్ టాపిక్ గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది నేతల శపథకాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంతవరకు గడ్డం తీసుకోనంటూ గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు. ఇప్పటికీ ఆ శపథం మీద ఆయన కట్టుబడి ఉన్నారు. గడ్డం తీసుకోకుండా అలాగే ఉన్నారు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఉత్తమ్ కుమార్ శపథంకు ఫలితం లభిస్తుందని ఉత్తమ్ భావించారు. అయినా ఆయను నిరాశ ఎదురైంది. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.

దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటు చేసింది. టీడీపీ, తెలంగాణ జనసమితి, సీబీఐ, సీపీఎం లాంటి అన్ని పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ టీఆర్ఎస్ గెలుపును మహాకూటమి అడ్డుకోలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. దాదాపు 90కి పైగా సీట్లతో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం నెరవేరలేదు.

అయితే ఇప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన శపథం ఆసక్తికరంగా మారింది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేంతవరకు కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతానంటూ ఆమె శపథం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపొందేంతవరు కాళ్లకు చెప్పులు వేసుకోనంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో గిరిజన, ఆదివాసి ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ శపథం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పిన ఆమె.. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేంతవరకు చెప్పులు ధరించనంటూ శపథం చేశారు.

అంతేకాదు మంత్రి సత్యవతి రాథోడ్ తన మాట మీద కట్టుబడి ఉన్నారు. శపథం చేసిన దర్గర నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతూ ఉన్నారు. తాజాగా మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున ఆమె ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆమె కోరారు. చెప్పులు లేకుండానే ఆమె ప్రచారం చేస్తుండటంతో.. తన శపథానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో వచ్ే ఎన్నికల్లో ఆమె శపథం నెరవరుతుందా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాంగా బీజేపీ తయారు అవుతుంది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాల్లో బలంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరగడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఉత్తమ్, సత్యవతి రాథోడ్ లలో ఎవరి శపథం నెరవేరుతుందనేది ఆసక్తికరగా మారింది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts