Mokshagna: మోక్షజ్ఞ ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తారా?

Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. తెలుగు సినిమాలకు చెందిన నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేస్తోంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో తిరుగులేని క్రేజ్ ను పెంచుకున్న ఎన్టీఆర్.. తన తర్వాతి ప్రాజెక్టుల మీద వర్కవుట్ చేస్తున్నాడు. నటనాపరంగానే కాకుండా, డ్యాన్స్ లోనూ తనకు ఎవరూ పోటీలేనంతలా ఎదిగాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

 

నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న మూడో తరంలో ఎన్టీఆర్ టాప్ లో ఉండగా.. త్వరలోనే ఎన్టీఆర్ కు పోటీ ఉండబోతోంది. అవును.. తారక్ కు త్వరలోనే నందమూరి కుటుంబం నుండి పోటీ రానుండగా.. బాబాయ్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. నిజానికి లెజెండ్ సినిమా షూటింగ్ సమయంలోనే నందమూరి బాలయ్య కొడుకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తాడనే ప్రచారం నడిచినా అది కుదరలేదు.

 

ఇక కొత్త ఏడాది వేళ నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి బాలయ్య.. మోక్షజ్ఞకు సంబంధించిన అన్ని విషయాలను సెట్ చేశాడని.. పూజా కార్యక్రమమే తరువాయి అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. కాగా నందమూరి కుటుంబం నుండి వస్తున్న మరో హీరో అవడానికి తోడు ఎన్టీఆర్ తో పోటీ నేపథ్యంలో ఇండస్ట్రీ జనాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

 

నందమూరి హీరోలు అంటే కేవలం డైలాగులు మాత్రమే కాదు, డ్యాన్స్ స్టెప్పులు కూడా అనే పేరుంది. తారక్ డ్యాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకపోగా.. లేటు వయసులో కూడా బాలయ్య స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ కూడా డ్యాన్స్ తో ఇరగదీయడానికి సిద్ధమైపోతున్నట్లు సమాచారం. డ్యాన్స్ విషయంలో తారక్ తో మోక్షజ్ఞ పోటీ పడేలా ఉంటాడనే టాక్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -