Naresh-Pavitra Lokesh: ఆరోజే నరేష్ పవిత్రల పెళ్లి జరగనుందా?

Naresh-Pavitra Lokesh: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ఆయన నాలుగో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల మూడో భార్య రమ్య నుండి ఆయన విడాకులు కూడా తీసుకున్నారు. నాలుగో పెళ్లి చేసుకోవడం గురించి పబ్లిక్ గానే ఆయన ప్రకటన చేశారు. నరేష్ తన సహ నటి అయిన పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో కూడా ప్రచారం సాగుతోంది.

 

త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా మీడియాకు తెలిపారు. వీరి పెళ్లి వార్త తెలుపేందుకు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ ను ముద్దు పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చారు. విజువల్స్ పరంగా ఆ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. రాబోవు రోజుల్లో ఇలాంటి చాలానే వస్తాయని నరేష్ తెలిపారు.

 

అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వీరు ఇంకొన్ని వీడియోల ద్వారా తమ ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. నరేష్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు వార్తలు షికారు చేశాయి. అయితే సమాజంలో వీరి గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్న తరుణంలో పెళ్లి చేసుకోవడానికి వీరు సిద్ధమయ్యారట. 2023లో వీళ్ళ పెళ్లి ఉంటుందని అప్పట్లోనే అందరూ అనుకున్నారు.

 

నరేష్, పవిత్ర లోకేష్ విడుదల చేసిన మొదటి వీడియోలో లిప్ లాక్ చేసి వీరిద్దరూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ముందు ముందు వీరి కలయికలో చాలా సినిమాలు వస్తాయని తెలుస్తోంది. నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లికి సంబంధించి డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. త్వరలోనే వీరి పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందోనని ప్రకటించనున్నారు. అంత వరకూ పలు వీడియోలు ఫ్యాన్స్ పలకరిస్తాయని నరేష్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -