Chiranjeevi: చిరంజీవి దెబ్బకు నిహారిక సైలెంట్ అవుతుందా.. విడాకులకు నో చెబుతుందా?

Chiranjeevi: మెగా డాటర్ నిహారికకు తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మనస్పర్ధలు తలెత్తాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఏకంగా విడాకులు తీసుకుని తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని చెబుతున్నట్లు తెలుస్తోంది.ఇలా వీరి గురించి వీరి విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 

ఇలా నిహారిక వెంకట చైతన్య విడాకుల వార్తలు వైరల్ కావడానికి గల కారణం చైతన్య నిహారిక ఇద్దరు కూడా ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో కాకపోవడమే కారణం అదేవిధంగా వెంకటచైతన్య తన ఇంస్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేయడంతో అనుమానాలు బలమవుతున్నాయి.ఇలా ఫోటోలన్నింటినీ డిలీట్ చేశారు అంటే తప్పనిసరిగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు వరకు వెళ్లారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే గత కొద్దిరోజులుగా మెగా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏ వేడుకకు కూడా చైతన్య హాజరు కాలేదు అలాగే నిహారిక కూడా ఒంటరిగా పలు వెకేషన్ లకు వెళ్లారు.ఇలా నిహారిక ఒంటరిగా కనిపించడంతో తప్పనిసరిగా ఈమె విడాకులు తీసుకోబోతుందనే వార్తలకు మరింత బలం చేకూరాయి. అయితే నిహారిక విడాకుల విషయం తెలిసి తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారనే వార్త సంచలనంగా మారింది.

 

నాగబాబు ఆవేశపరుడు కావడంతో చిరంజీవి ఈ విషయంలో కలుగజేసుకొని వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ రావుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట. ప్రభాకర్ రావు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు దీంతో ఈయన పిల్లల విషయం గురించి మంచిగా మాట్లాడి వీరి బంధం రెండుగా చీలిపోకుండా వారిని కలిపే ప్రయత్నం చేస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది.ఇలా చిరంజీవి వెంకట చైతన్య అతని ఫ్యామిలీతో మాట్లాడి ఈ వివాదానికి ఇక్కడే పులి స్టాప్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారట. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -