NTR: బాలయ్య విషయంలో ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందా?

NTR: కథానాయకుడిగా, వ్యాఖ్యాతగా, ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నందమూరి బాలయ్య. తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండు సార్లు ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే 2019 ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొన్నేళ్ల వరకు హిందూపురంలో బాలయ్య తరఫున ఇతర వ్యక్తులు కార్యకలాపాలను పర్యవేక్షించేవారు. అయితే వారిలో కొందరిపై అవినీతి ఆరోపణలు వస్తుండటంతో బాలయ్య అందరినీ తప్పించాడు. తనకు సన్నిహితుడిని, నిజాయితీ పరుడికి బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ బాలయ్యకు దొరకలేదు. దీంతో బాలయ్యపై వ్యతిరేకత మొదలైంది. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేడని, పార్టీ వర్గాల నుంచి ఆరోపణలు ఎదురయ్యాయి.

 

 

 

దీంతో బాలయ్యనే స్వయంగా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు ఏర్పడినా.. బాలయ్య విజయం సాధించారు. అయితే తను తీసుకొచ్చిన సేవా కార్యక్రమాలను విస్తృతపరిచారు. నూతన పద్ధతులను ఫాలొ అవుతూ.. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా అన్న క్యాంటిన్‌లు ఏర్పాటు చేసి.. రూ.2కే భోజనం అందిస్తున్నారు. మొబైల్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి.. గ్రామగ్రామాన తిరుగుతూ వైద్యం అందజేస్తున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారికి వాటిని మాన్పించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులకు వచ్చే వారికి రూ.200 చొప్పున ఒక్కొక్కరికి చెల్లిస్తున్నారు. దీంతో ధూమపానం, మద్యపానం నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తోంది. అలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ.. బాలయ్య ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నారు.

 

 

ప్రస్తుతం బాలయ్య కెరీర్ ఫుల్ జోష్‌లో నడుస్తోంది. సినిమాల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అన్నీ రంగాల్లో రాణిస్తున్న బాలయ్యకు ఓ కోరిక ఉన్నట్లు తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలయ్య హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. మంత్రి అవ్వాలని బాలయ్య కోరుకుంటున్నట్లు సమాచారం. చూడాలి మరీ.. రాబోయే రోజుల్లో బాలయ్య మంత్రిగా బాధ్యతలు చేపడుతాడా? లేదా? అనేది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -