Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కోరిక తీరుతుందా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో జోరు పెంచారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినీ జర్నీని బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ‘వకీల్‌సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఏఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, రాబిన్‌ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. పలు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమచారం.

 

 

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మొఘల్ యువరాణి పాత్రలో నర్గీస్ ఫక్రీ నటించగా.. పంచమి అనే పాత్రలో నిధి కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. సినిమాలో బిజీగా ఉంటూనే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ఆయా గ్రామాల ప్రజలతో మమేకం అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, గత ఎన్నికల ఫలితాన్ని రిపీట్ కానివ్వకుండా చూసుకునేందుకు పవన్ భారీగా శ్రమిస్తున్నారట. సినిమాలో సక్సెస్ సాధిస్తున్నప్పటికీ.. రాజకీయాల్లో విఫలం అవుతుండటంతో పవన్ ఫ్యాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన భారీ మెజార్టీతో గెలిచి.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావాలని ఫ్యాన్ అనుకుంటున్నారట. ఈ సారి జరిగే ఎన్నికల్లోనూ భారీ పోటీ నెలకోనుంది. చూడాలి మరి.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సాధించి సీఎం అవుతారా? లేదా గత ఫలితాలే ఎదురవుతాయా? వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -