KCR: కేసీఆర్ తలచుకుంటే పొలిటికల్ లెక్కలు మారిపోతాయా?

KCR: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో ఇరుక్కున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది అయితే ఈయన ఇప్పుడు అప్రూవర్ గా మారడం వెనుక చాలా రాజకీయ వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈయన అప్రూవల్ గా మారడం వెనుక జగన్ ప్రమేయం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత అరబిందో రియాల్టీకి పోర్టులు, సెజ్‌లు కట్టబెట్టారు. చాలా నిగూఢమైన ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. ఏపీలో అమ్మకం అయ్యే సగం లిక్కర్ శరత్ చంద్రారెడ్డి కంపెనీ నుంచి సరఫరా అవుతుందని తెలుస్తుంది. ఇలా లిక్కర్ స్కాం లో నిందితుడుగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు అప్రూవర్ గా మారడంతో ఈయన వెనుక జగన్ ఉన్నారని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.

 

ఇక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఈయన అప్రూవర్ మారారని ప్రకటించడంతో ఈ వ్యవహారం వెనుక జగన్ ప్రమేయం తప్పకుండా ఉందని తెలిసింది. ఇక ఈయన ఈ కేసు నుంచి బయటపడటంతో ఈ కేసు కేజ్రీవాల్ మెడకు కూడా చుట్టుకుంది. ఈ క్రమంలోనే ఈయన కూడా అరెస్ట్ అవుతారని తెలుస్తుంది.కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు , అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. ఇకపోతే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించడంతో ఈమెను కూడా అరెస్టు చేస్తారని పలువురు భావిస్తున్నారు.

 

ఇదే కనుక జరిగి కవిత జైలుకు వెళ్తే పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మారిపోతాయని తెలుస్తుంది. శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ గా మారి కవిత జైలుకు వెళ్తే కెసిఆర్ జగన్ మోహన్ రెడ్డిని ఏమాత్రం ఉపేక్షించారని తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడం వెనుక కేసీఆర్ పాత్ర కూడా చాలా ఉందని తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చాలా ఆసక్తిని రేపుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -