Ponguleti Srinivasa: పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీలో చేరేది అప్పుడేనా?

Ponguleti Srinivasa: ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం జరుగుతుంది.తమ పార్టీని టికెట్ ఇవ్వని పక్షంలో కొందరు నేతలు ఇతర పార్టీలలోకి వెళ్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కూడా పలువురు రాజకీయ నాయకులు ఇతర పార్టీలలోకి వలస వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బి ఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 30వ తేదీ 30 వ తేదీ సరూర్ నగర్ లో నిర్వహించబోతున్న నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ క్రమంలోని ఈమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి మంత్రాంగం ఫలించింది. వారిద్దరితో చర్చలు పూర్తయ్యాక, ప్రియాంక గాంధీ సమక్షంలో కండువాలు కప్పుకోవడానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఇక వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి మరికొంత బలం చేకూరిందని చెప్పాలి. జూపల్లికృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా ఆర్థికంగా ఎంతో బలమైన నాయకులు దీంతో ఇలాంటివారు తమ పార్టీలోకి రావడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావించిన అధిష్టానం వీరిని పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధమైంది అయితే వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అంటే వీరు చెప్పినటువంటి షరతులకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుందని,అందుకే ఇద్దరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది.

 

బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్ లోకి, జూపల్లి బీజేపీలోకి వెళ్తారనే అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా జూపల్లి కూడా కాంగ్రెస్ కే జైకొట్టారు.ఇలా ఈ ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో బిజెపికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది. తెలంగాణలో బిజెపి పార్టీకి భారీ స్థాయిలో బలం చేకూరుతుందని భావిస్తున్నటువంటి కమలం నేతలకు వీరిద్దరూ గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -