Prabhas: ఆ సినిమాలో ప్రభాస్ సీఎం పాత్రలో కనిపించనున్నారా?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇక ప్రభాస్ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది అభిమానులకు పండగే. అలాంటి అప్ డేట్ ఒకటి ఇప్పుడు ప్రభాస్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. సీఎం ప్రభాస్ జిందాబాద్ అంటూ కేరింతలు పెట్టిస్తోంది. ప్రభాస్ ఏంటి? సీఎం ఏంటి? ఇంతకీ ఏంటా సంగతి? ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు అంత హడావుడి చేస్తున్నారు. పూర్తి వివరాలు మీరే చదవండి.

 

ప్రభాస్ సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇప్పుడు అభిమానుల్లోనే కాక సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. సోనాల్ మీడియాలో. నెట్టింట్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇది ప్రభాస్ తర్వాతి మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్ డేట్. ప్రభాస్ సుకుమార్ తో ఓ మూవీ చేయనున్నాడని ఎప్పటినుండో చర్చ జరుగుతోంది. సుకుమార్ ప్రభాస్ కోసం ప్రత్యేకంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని, ఇక ఆ మూవీ మాములుగా ఉండదని ఇప్పటికే సినీ జనాలు ఫిక్స్ అయిపోయారు.

 

సుకుమార్ తో సినిమాలో సీఎం ప్రభాస్..?
ఇక సుకుమార్ దరసకత్వంలో చేయనున్న మూవీలో ప్రభాస్ పాత్ర గురించి ఇప్పుడు ఈ చర్చ అంతా జరుగుతోంది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో ప్రభాస్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇలా ప్రభాస్ ను సీఎం గా చూపించడానికి సుకుమార్ గారు ఎంతగానో స్టోరీ, డైరెక్షన్ కి సంబంధించిన పనులపై ఫోకస్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. నిజంగానే ప్రభాస్ సీఎం పాత్రలో కనిపిస్తే ఇక టాలీవుడ్ లో మరో పొలిటికల్ సెన్సేషనల్ మూవీ వచేసినట్లే.

 

ప్రభాస్ సీఎం రోల్ లో నటించనున్నాడని తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే నిజమైతే తెలుగు సినీ చరిత్రలో పొలిటికల్ సూపర్ హిట్ సినిమా గా ఈ చిత్రం నిలుస్తుందని కాలర్ ఎగరేస్తున్నారు అభిమానులు. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా ఒదిగిపోయే నటనతో, అభిమానులకు వినోదం పంచే ప్రభాస్.. సీఎం పాత్రలో ఇరగదీస్తాడని, మరో సూపర్ హిట్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రభాస్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ విసయంపై పూర్తి వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -