Raj Tarun-Lasya: రాజ్ తరుణ్ యాంకర్ లాస్య బావామరదళ్లు అవుతారా?

Raj Tarun-Lasya: టాలీవుడ్ లో ఎక్కువగా గాసిప్స్ వార్తలు వైరల్ అవుతుంటాయి. వాటి వల్ల సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొందరు మాత్రం లైట్ తీసుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో రాజ్ తరున్, స్టార్ యాంకర్ లాస్య ఇద్దరూ బావమరదల్లు అవుతారని, గతంలోనే వీరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైలర్ అయ్యాయి. కొందరు గాసిప్ రాయుళ్లు, వెబ్ సైట్లలో ఇటువంటి పుకార్లు పుట్టిస్తూ ఉండటం వల్ల లాస్య ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యిందని తెలుస్తోంది.

 

రాజ్‌త‌రుణ్‌ తో పరిచయమే లేకుండా ఉంటే వారిద్దరికీ లింకులు పెట్టి వార్తలు రాసేశారట. అంతేకాదు రాజ్ తరుణ్, లాస్య ఇద్దరూ సీక్రెట్ లేచిపోయి పెళ్లి చేసుకున్నారని అనేక పుకార్లను పుట్టించారు. ఆ తర్వాత వారిద్దరి పెళ్లి జరగలేదని, వారికి పెళ్లే కాలేదని ఇంకొన్ని వార్తలు రాసుకుంటూ పోతున్నారు. ఈ పుకార్లపై లాస్య ఈ మధ్యనే తన భర్తతో కలిసే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

 

హీరో రాజ్‌త‌రుణ్‌తో తాను అస్సలు వర్క్ చేయలేదని, ఓ ఆడియో ఫంక్ష‌న్ కోసం తాను రాజ్‌త‌రుణ్‌, నోయ‌ల్ క‌లిసి ఓ హోట‌ల్లో ఉండగా ఆ సమయంలో సెల్ఫీ తీసుకున్నామని, అయితే నోయ‌ల్‌ ఫోటోను తీసేసి తాను రాజ్ తరుణ్ ఉన్న ఫోటోలు వైరల్ చేశారని లాస్య చెప్పుకొచ్చింది. తమపై ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఏవేవో రాసేశారని లాస్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రాజ్‌త‌రుణ్‌తో సెల్ఫీ తీసుకోవ‌డ‌మే త‌ప్ప‌యిపోయిందని, లాస్య ఆవేదన వ్యక్తం చేసింది.

 

అస‌లు తన గురించి ఇలా ఎవరు రాయిస్తున్నారో తెలియడం లేదని, గతంలో తాను, రవి కలిసి పలు షోలు చేశామని, ఆ సమయంలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుంది కాబట్టి గాసిప్స్ రాసే అవకాశం ఉందని, అయితే ఇలా రాజ్ తరుణ్ తో పరిచయం కూడా లేకపోయినా లింకులు పెట్టి రాయడం కరెక్టు కాదని ఆమె తెలిపింది. ఇలాంటి వార్తలు రాసే ముందు సెలబ్రిటీల జీవితాలను మనసులో ఉంచుకుని ఆలోచించి రాయాలని లాస్య కోరింది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -