Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో రేవంత్ పోటీ చేసే నియోజకవర్గం అదేనా?

Revanth Reddy:టీపీసీసీ అధ్యక్షుడు, మాల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో తన నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓడిపోయారు. టీఆర్ఎస్ టార్గెట్ చేసి రేవంత్ ను ఓడించగలిగింది. మంత్రి హరీష్ రావు కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు కేసీఆర్ స్వయంగా ఇక్కడ బహిరంగ సభ నిర్వహించారు. దీంతో గత ఎన్నికల్లో తన కంచుకోట అయిన కొడంగల్ లోనే రేవంత్ కు చుక్కెదురైంది. దీంతో తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ చేసి గెలిచారు.

అయితే ఈ సారి ఎంపీగా రేవంత్ పోటీ చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ తన శాయశక్తులా శ్రమిస్తున్నారు. రేవంత్ ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం ఉండదు. అందుకే ఖచ్చితంగా రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతారు. అయితే తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గాన్నే రేవంత్ ఎంచుకుంటారా.. లేక మరో నియోజకవర్గానికి మారతారా అనేది ఇఫ్పుడు చర్చనీయాంశంగా మారింది. రేవంత్ ఫ్యాన్స్ లో కూడా దీనిపై ఆసక్తి నెలకొంది. రేవంత్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు.

ప్రస్తుతం రేవంత్ మాల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. దీంతో మల్కాజ్ గిరి పరిధిలోని ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలోనే ఆలోచన చేస్తున్నట్లు రేవంత్ వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కవ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో రేవంత్ ఇక్కడ నుంచి పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ కు కూడా కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది. మల్కాజ్ గిరి పరిధిలో ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవరక్గాలు ఉన్నాయి. వీటిల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు అత్యంత సన్నిహితులు చెబున్నారు.

గత ఎన్నికల్లో అక్కడ నుంచి కాంగ్రెస్ తరపున సుధీర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి ఎవరు లేరు. ఎల్బీ నగర్ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. రేవంత్ కు తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. ఏపీకి చెందిన వారు కూడా రేవంత్ ను అభిమానిస్తారు. దీంతో ఆంధ్ర ప్రభావం ఎక్కువగా ఎల్బీ నగర్ నియోజకవర్గం సేఫ్ ని రేవంత్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే గత ెఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందగా.. అంతుకుముందు టీడీపీ తరపున ఆర్.కృష్ణయ్య ఇక్కడ వి జయం సాధించారు.

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు టీఆర్ఎస్ గెలుపొందిన చరిత్ర లేదు. కాంగ్రెస్, టీడీపీనే ఇక్కడ గెలుస్తూ వచ్చాయి. అంతేకాక రేవంత్ మాల్కాజ్ గిరి ఎంపీగా ఉండటంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంపై పట్టు ఉంది. దీంతో ఆ నియోజకవర్గం నుంచే రేవంత్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎల్బీ నగర్ లో టీఆర్ఎస్ కు బలమైన అబ్యర్థి ఎవరూ లేరు. ఆంధ్రా ఓటర్ల ప్రభావమున్న ప్రాంతాల్లో పోటీ చేస్తే రేవంత్ కు కలిసొచ్చే అవకాశముంది. దీంతో ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల నుంచే రేవంత్ పోటీ చేసే అవకాశం ఈ సారి ఉందని కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -