Rohit Sharma: టీమిండియా రోహిత్ శర్మ కొనసాగుతాడా? లేదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!

Rohit Sharma: ప్రతి టోర్నీలోనూ భారీ అంచనాల మధ్య అడుగుపెడుతున్న టీమిండియా అనుకోని స్థితిలో సదరు టోర్నీ నుండి బయటకు వస్తుండటం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ తో సహా చాలా టోర్నీల్లో టీమిండియా ఇలా వెనక్కి వస్తుండటంతో క్రికెట్ అభిమానుల్లో నిరుత్సాహం నిండుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా వన్డే, టెస్ట్ టీంలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్సీ మీద చర్చ మొదలైంది.

 

టీమిండియా బెస్ట్ ప్లేయర్లలో ఒకడైన రోహిత్ శర్మ.. వ్యక్తిగతంగా హిట్ మ్యాన్ గా అద్భుతాలు చేస్తున్నా, కెప్టెన్ గా మాత్రం విజయాలను సాధించకపోతుండటంతో చర్చ మొదలైంది. గత కొద్దిరోజులుగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా పేలవమైన ప్రదర్శనలతో తిరుగుముఖం పడుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక సమావేశం నిర్ణయించి.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో టీమిండియా వన్డే, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ గా రోహిత్ శర్మనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎలాంటి ముప్పు లేదని బీసీసీఐ మీటింగ్ నుండి అందుతున్న లీక్ ప్రకారం తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన గేంల ప్రకారం రోహిత్ శర్మ నాయకత్వంలో అసంతృప్తి కలిగించే అంశాలేవీ లేవని బీసీసీఐ భావిస్తోందని అందుకే అతడిని కెప్టెన్ గా కొనసాగించడానికి బీసీసీఐ సభ్యులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

కాకపోతే వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రం రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ల మీద ఎలా ముందుకు సాగాలనే విషయాల మీద కూడా బీసీసీఐ సభ్యులు రోహిత శర్మతో చర్చించినట్లు సమాచారం. ఈ రెండు టోర్నీలలో టీమిండియా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తే.. భవిష్యత్తులో మంచి అనుకూల ఫలితాలు వస్తాయని భేటీలో అందరూ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -