YS Vijayamma: విజయమ్మ మద్దతుతో షర్మిల అధికారంలోకి వస్తారా?

YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి గారు వైయస్ విజయమ్మ తెలంగాణలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సి వస్తుంది.విజయమ్మ కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈమె వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించి తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై పోరాటమే కాకుండా పలు అంశాలపై అధికార పార్టీని విమర్శిస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

షర్మిల పాదయాత్ర చేస్తూ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈమె పాదయాత్రను అడ్డుకున్నారు.అయితే తాజాగా షర్మిల బయటకు వెళుతుండగా పోలీసులు తాను బయటకు వెళ్లడానికి వీలు లేదంటూ అడ్డుకున్నారు. దీంతో వైఎస్ షర్మిల పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇలా తన కుమార్తెను అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న వైయస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులు వైయస్ విజయమ్మను షర్మిలతో మాట్లాడటానికి తనని కలవడానికి అనుమతి తెలపలేదు. దీంతో తన కూతురిని కలవకుండా అడ్డుకోవడానికి కారణాలు ఏంటి అని ప్రశ్నించారు. అయితే పోలీసులు సరైన కారణాలు తెలుపకపోయినప్పటికీ ఆమెను అనుమతించకపోవడంతో నిరసనకు దిగారు.

ఇలా పోలీసుల మధ్య వైఎస్ విజయమ్మ మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ముఖ్యమంత్రి అయినా తన కుమారుడు జగన్ కి ఎలాంటి మద్దతు తెలపలేదని,తన కుమార్తెకు పూర్తిగా తన మద్దతు ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. అయితే తమ ముఖ్య మంత్రి తల్లిగారు ఇలా రోడ్డుపై నిరసనలకు దిగడంతో వైఎస్ఆర్సిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -