Sharwanand: ఆ అమ్మాయినే శర్వానంద్ పెళ్లి చేసుకోనున్నారా?

Sharwanand: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా చేరిపోయాడు. ఇప్పటికీ ఆయనకు 38 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అందుకే సోషల్ మీడియాలో శర్వానంద్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ప్రభాస్, సల్మాన్ ఖాన్ కు శర్వానంద్ ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి కామెంట్స్ కు చెక్ పెడుతూ శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ అమెరికాలో జాబ్ చేసే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వివాహం చేసుకోనున్నాడు. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వధువుగా సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కారణంగా ఇండియాలోనే ఉంటూ తన వర్క్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఉంటోందట. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కి దూరపు చుట్టమైన ఓ ఫ్రెండ్ కారణంగా ఈ సంబంధం వచ్చినట్లు తెలుస్తోంది.

శర్వానంద్ కి ఆ అమ్మాయిని రామ్ చరణ్ ఫిక్స్ చేశాడనే క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఫిబ్రవరి మొదటి వారంలోనే శర్వానంద్ నిశ్చితార్థం, మార్చిలో పెళ్లి జరగనున్నట్లు నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. మొత్తంగా 2023 శర్వానంద్ కు బాగా కలిసి వస్తుందని అటు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

2023లో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతుండటం నిజంగా సంతోషకరమైన వార్త అని నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్, శర్వానంద్ ఎప్పటి నుంచో స్నేహితులు. వీరిద్దరూ ఎప్పుడూ ఒక్కటిగా ఉంటారు. శర్వానంద్ కూడా చిన్నప్పుడు చిరంజీవి ఇంట్లోనే చాలా కాలం గడిపారు. అటువంటి ఫ్రెండ్ కు రామ్ చరణ్ పెళ్లి సెట్ చేయడం గొప్ప విషయమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -