Mahesh babu: త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ డిమాండ్ తీరుతుందా?

Mahesh babu: ఒక సినిమా కథ రాయడం నుంచి విడుదల తేదీ వరకు వెళ్లాలంటే ఎన్నో ఆటంకాలను దాటుకొని ముందుకు వెళ్లాల్సిందే. హీరోని ఎంచుకోవడం, తన డేట్లను తీసుకోవడం, మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవడం ఇలాగా ప్రతిదీ పెద్ద పనే. అయితే అందరూ అన్ని కండిషన్లకి ఒప్పుకోరు. ఇక్కడ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో కూడా ఇదే తిరకాసు వచ్చింది.

వీళ్ళిద్దరూ కలిసి నిర్మిస్తున్న సినిమాని మహేష్ బాబు 90 రోజుల్లో పూర్తి చేయాలి అని, అలాగే షూటింగ్ ఉన్న రోజుల్లో డేట్లు లేని యాక్టర్లను మార్పించైనా సరే షెడ్యూల్ పూర్తి చేయాలి అని మొండిపట్టు పట్టినట్టు సమాచారం అందుతుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం పండుగకి విడుదల కానుంది కనుక అంత కంగారు ఏమీ లేదు. కానీ రెండు అడుగులు ముందుకేస్తే మూడు అడుగులు వెనకకు వేస్తుంది ఈ సినిమా.

 

మరి త్రివిక్రమ్, నిర్మాతలు మహేష్ పెట్టిన కండిషన్ కి ఏమంటారో చూడాలి. ఈ సినిమా షూటింగ్ కి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల 5న గాని 6న గాని తిరిగి ప్రారంభం అవుతుంది. అయితే ఇందులో పూజా హెగ్డే మరియు శ్రీ లీల కథానాయకులుగా ఎంపిక కాగా తమ ఈ సినిమాకు పాటలను కంపోజ్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

 

వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన రెండు సినిమాలు హిట్ కాగా హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలాగా ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే రోజున సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మోసగాళ్లకు మోసగాళ్లు కూడా రీ రిలీజ్ అవ్వబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -