Tarak: ఆ పాత్ర చేయాలనే తారక్ కోరిక తీరుతుందా?

Tarak: టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక చరిత్ర ఉంది. దీనికి కారణం ఆ ఫ్యామిలీకి మూల పురుషుడు అయిన లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు అని అందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాత్రమే కాకుండా ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే వారిలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.

 

ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులంతా నందమూరి హీరోల కాంబోలో మల్టీస్టారర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా దీనిపై తారక్ క్లారిటీ ఇచ్చాడు. అభిమానులు పండుగ చేసుకునే విషయాన్ని ఎన్టీఆర్ తెలిపాడు. ‘అఖండ’ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కడిన బాలయ్య ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు.

అటు తారక్ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత.. వీరరాఘవ’ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యారు.

 

అయితే వాస్తవానికి నందమూరి కుటుంబ హీరోల నుంచి మల్టీస్టారర్ మూవీ ఉంటుందని చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య – ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇకపోతే బాలయ్యకు ఏదైనా ఒక సినిమాలో కొడుకుగా కనిపించాలని జూనియర్ ఎన్టీఆర్ కోరిక అట. ఈ విషయాన్ని తారక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాబోయే రోజుల్లో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ఒక సినిమాలో నటిస్తారేమో చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -