CM Jagan: ఏపీలో అలా జరగనుందా.. సీఎం జగన్ షాకింగ్ నిర్ణయమంటూ?

CM Jagan: ప్రస్తుతం ఏపీలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజంగానే జగన్ అటువంటి నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఒట్టి రూమర్స అన్న సంగతి పక్కన పెడితే ఆ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న కొడాలి నాని కి జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవిని అప్పగించబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

 

ఇక తాజాగా సోషల్ మీడియాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని మంత్రిగా తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు జగన్ క్యాబినెట్ లో కొనసాగుతున్నారట. ఇక వారిలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా ఉండగా రెండవ వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన సీదరి అప్పలరాజు అని తెలుస్తోంది. కాగా ఆయన మత్య్స పశుసంవర్ధక శాఖలను చూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఫస్ట్ వికెట్ పడిపోయేది సీదరిదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సీదరిని తప్పించడం నూరు శాతం ఖాయమని అంటున్నారు. ఆ ప్లేస్ లో అదే జిల్లా నుంచి మరొకరికి చాన్స్ ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ నేతగా, పెద్దాయనగా కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ని మంత్రిగా తీసుకోబోతున్నారు అని సమాచారం. తమ్మినేనిని జగన్ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

తమ్మినేని జగన్ తనకు రాజకీయంగా పునర్జన్మ ప్రసాదించారని ఎపుడూ చెబుతూ ఉంటారు. ఆయన చివరి సారిగా 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ రెండు దశాబ్దాల తరువాత 2019లో జగన్ వేవ్ లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు బద్ధ ప్రత్యర్ధిగా ఘాటైన మాటలతో దాడి చేసే సత్తా ఉన్న నేతగా కూడా చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రాలో వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయనను మంత్రిగా తీసుకుంటే ఉత్తరాంధ్రాలో తమ పట్టు నిలుస్తుందని జగన్ భావిస్తున్నారట.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -