Samantha: వ్యాధి ముదిరితే సమంతకు అలా జరుగుతుందా?

Samantha: తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత. ‘ఏమాయ చేసావే’ అంటూ తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన సమంత.. తెలుగుతో పాటు పలు భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. హిందీలో కూడా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు బాలీవుడ్ లో కూడా తనకు అవకాశాలను మూటగట్టుకుంది.

సమంత తాజాగా తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత అధికారికంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. కాగా సమంత త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకోగా.. ఈ వ్యాధి ఏంటి? ఎందుకు వస్తుందని, ఏం జరుగుతుందని ఆరా తీసే వారు ఎక్కువయ్యారు. ఆ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

వయోసైటిస్ అనే వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని తెలుస్తోంది. లేదంటే కొన్నిసార్లు ఎక్కువగా వ్యాయామాలు చేస్తే కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరం ఉబ్బినట్లు అవుతుందని, ముఖం కూడా పాలిపోయినట్లు అవుతుందట.

వయోసైటిస్ వ్యాధితో బాధపడే వారి ముంజేతి మోకాలి కండరాలు నొప్పికి గురవుతాయని, నీరసానికి గురయ్యేలా ఉంటారట. నిజానికి ఈ వ్యాధితో బాధపడే వారు వ్యాధిని గుర్తించడం కష్టం అని కానీ సమంత గుర్తించిందని వైద్యులు చెబుతున్నారు. ఆమె ఇక మీదట హార్డ్ స్టెప్స్ కానీ స్టంట్స్ కానీ చేయడానికి వీలుండదట. ఈ వ్యాధి మరీ ముదిరితే వ్యాధిగ్రస్తులు మంచానికే పరిమితం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: కాంగ్రెస్ గెలుపు అక్కర్లేదు.. వైసీపీ ఓడితే చాలు.. షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఆదరణ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు పీకల వరకు కోపం...
- Advertisement -
- Advertisement -