Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేయడానికి భారీ ప్లాన్స్.. జాగ్రత్త పడతారా?

Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయనకు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. సాధారణంగా ఎన్టీఆర్ తన సినిమా పనులను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంటారు తప్ప అనవసరమైన వివాదాలలోకి తల దూర్చారు..

ఇలా ఎన్టీఆర్ కేవలం తన సినిమా విషయాల గురించి మాత్రమే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఇలా ఏ తప్పు చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయే ఎన్టీఆర్ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ పెరిగిపోయింది కొందరు ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ తనని ట్రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. సొంత కుటుంబ సభ్యుల ఎన్టీఆర్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

 

నందమూరి కుటుంబానికి చెందిన ఒక ఆగ్ర హీరో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రావడం ఇష్టం లేదని విధంగా సంకేతాలు పంపించడంతో ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేక వీరిద్దరూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు దూరంగా ఉన్నారనీ తెలుస్తుంది.ఇలా నందమూరి ఫ్యామిలీ లో ఉండే ఈ హీరోల మధ్య ఏమాత్రం మంచి సంబంధాలు లేవని స్పష్టమవుతుంది.

 

ఇక ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఎంతో ఆకాంక్షిస్తున్నారు.కానీ టిడిపి పార్టీలో ముఖ్య నేతలు తనని పార్టీలోకి ఆహ్వానించే వరకు తాను కూడా రాజకీయాల గురించి ఆలోచన కూడా ఎన్టీఆర్ కు లేదని తెలుస్తోంది.ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా ఆయనని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఆయన నటించిన సింహాద్రి సినిమాని విడుదల చేయగా ఈ సినిమా అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది అంటూ ఎన్టీఆర్ గురించి ఎన్నో కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇలా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ అంటే ఇష్టం లేనటువంటి వారు తనని ఇండస్ట్రీలో తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.అయితే ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో ఎంత అనగతొక్కాలని ప్రయత్నించిన అంత ఎత్తుకు ఎదుగుతారు అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -