Janasena: ఆ నివేదికలోని వాస్తవాలే జనసేన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయా?

Janasena: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈయన గురువారం ఉన్నపలంగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిస్తే జనసేన కార్యకర్తలు హంగామా మామూలుగా ఉండదు కానీ పవన్ కళ్యాణ్ ను రిసీవ్ చేసుకోవడం కోసం నాదెండ్ల మనోహర్ మాత్రమే హాజరయ్యారు.

ఇలా పవన్ తో కాసేపు ముచ్చటించిన మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉన్నారని తెలిసి కూడా ఎవరు అటువైపు వెళ్ళలేదు ఈయన గురువారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చాలా రహస్యంగా ప్రధాన కార్యదర్శిలను నాయకులను పక్కనపెట్టి ఏకాంతంగా ఓ సర్వే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు మాత్రం కలిసి వారితో పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.

 

పవన్ కళ్యాణ్ సర్వే సంస్థకు కొన్ని సూచనలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జనసేన పార్టీకి బలం ఉంది ఎక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న విషయం గురించి సర్వే చేయమని తెలియజేశారట. ఈ క్రమంలోనే సర్వే సంస్థ అధికారులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయి రాష్ట్రంలో ఎక్కడ తనకు మంచి బలం ఉంది అన్న విషయాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది.

 

ఇలా రాష్ట్రంలో జనసేనకు కీలకంగా ఉన్న ప్రాంతాల గురించి ఈయన సర్వే చేశారని,ఈ సర్వే ఆధారంగా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి సర్వే అధికారులు అన్ని విషయాలు చెప్పినట్టు కనక అయితే మరో రెండు రోజులలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసి సీట్ల గురించి పొత్తు గురించి ఓ క్లారిటీకి రాబోతున్నారని తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ సర్వే ను నమ్ముకుని ఎన్నికల బరిలో దిగబోతున్నారని ఈ సర్వేనే తన జాతకాన్ని మార్చబోతుందని పలువురు భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -