Agri gold: అగ్రి గోల్డ్ బాధితులకు మరో షాక్ తగలనుందా.. ఏం జరిగిందంటే?

Agri gold: ప్రస్తుతం అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి దారుణంగా మారింది. అగ్రిగోల్డ్ సంస్థ యజమాని అవ్వాస్ వెంకట రామారావు తన సంస్థ ఆస్తులను అమ్ముకుంటాను అనుమతినివ్వమంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాంతో అగ్రిగోల్డ్ బాధితులు తలలు పట్టుకుంటున్నారు. అయితే వెంకట రామారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు ఆస్తలును అమ్ముకునే అవకాశం ఇస్తే ఏడాదిలో ఆరున్నర వేల కోట్లు డిపాజిట్ చేస్తానని ఆయన చెబుతున్నారు.

నిజానికి ఆ ఆస్తులను అమ్మి డిపాజిట్లకు చెల్లించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. దానికి తోడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా ఓనరే కోర్టులో పిటిషన్ వేసి ఆస్తులను అమ్ముకుంటానని చెబుతున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా కూడా ఇలాంటి పిటిషనే కోర్టులో వేశారు. బ్యాంకులు , దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన తన ఆస్తుల్ని విడిపిస్తే చెల్లించాల్సినవన్నీ చెల్లిస్తానని ఒప్పుకున్నారు. కానీ ఆయనకు సానుకూల నిర్ణయం రాలేదు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఓనర్ కూడా అదే చేస్తున్నారు.

 

అగ్రిగోల్డ్ ఓనర్ పిటిషన్ కు కోర్టు ఆస్తులన్నీ ఆయనకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన అమ్ముకుంటారు. ఆ తర్వాత డబ్బులు కడతారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అమ్మితే అంత పెద్ద మొత్తం రాలేదని లేకపోతే మరొకటని చెప్పి వ్యవస్థలతో ఆడుకోవచ్చు. ఇన్ని లక్షల మందిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరోసారి కోర్టుల్ని మోసం చేయరని రూల్ ఏమీ లేదు కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నా. దానికి తోడు ఏపీ సీఎం జగన్ తాను అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు 1100కోట్లు ఇస్తానని హమీ ఇచ్చారు. నాలుగేళ్లు దాటినా పైసా ఇవ్వలేదు. చివరి ఏడాది ఆస్తులన్నీ అగ్రిగోల్డ్ ఖాతాకే వెళ్లిపోయేలా పరిస్థితులు మారుతున్నాయి. బాధితులు మాత్రం ఆక్రందనల్లో ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -