Pawan Kalyan: పవన్ లాంటి గొప్ప హీరోలు ఈ కాలంలో ఉంటారా?

Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరోల్లో అందరికంటే విభిన్నం పవన్ కల్యాణ్ అని చెప్పొచ్చు. తనదైన స్టయిలిష్ నటన, వైవిధ్యమైన హావభావాలు, మేనరిజమ్స్ తో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. తెరపై పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకుంటారు కాబట్టే ఆయన్ను అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ అని పిలుస్తారు. ఆ పేరుకు తగ్గట్లే ఆయన సినిమాలు కూడా పవర్ ఫుల్ గా ఉంటూ అన్ని రకాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాయి.

 

రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ సినిమాల్లోనూ నటిస్తున్నారు పవన్. అయితే మునుపటిలా కాకుండా కాస్త తగ్గించారు. కానీ వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో మళ్లీ ఆయన జోరు పెంచారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే తాను కమిటైన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’తోపాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీస్ లో నటిస్తున్నారు. ఇందులో ‘వీరమల్లు’కు జాగర్లమూడి క్రిష్​ దర్శకత్వం వహిస్తుండగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.

 

సున్నితంగా నో చెప్పేసిన పవన్
‘వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’తోపాటు ‘సాహో’ దర్శకుడు సుజిత్ తోనూ ఓ మూవీ చేసేందుకు పవన్ కల్యాణ్​ ఓకే చెప్పారని వినికిడి. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇదిలాఉండగా.. పవన్ కల్యాణ్​ ఓ క్రేజీ ఆఫర్ ను కాదన్నారట. రూ.500 కోట్ల రెమ్యూనరేషన్ వరుసగా మూడు సినిమాల్లో నటించాలని పవన్ కు ఓ నిర్మాత ప్రపోజల్ పెట్టారట. అయితే దీనికి పవర్ స్టార్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం.

 

వందల కోట్ల ఆఫర్ ను పవర్ స్టార్ సున్నితంగా వద్దనుకోవడంపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. తనకు డబ్బుల కంటే సినిమాకు సంబంధించిన కథా, కథనాలు ముఖ్యమని పవన్ చెప్పకనే చెప్పేశారని కొందరు అంటున్నారు. పవన్ కు అసలు ఈ ఆఫర్ వచ్చిందా, ఆయన నో చెప్పారా అనే దాంట్లో నిజం ఎంతుందనేది ఒక్క ఆయనకే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -