Rajamouli-Mahesh: మహేష్ రాజమౌళి సినిమాలో ఇన్ని ట్విస్టులు ఉంటాయా?

Rajamouli-Mahesh: తెలుగు చలన చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. ఆయన తీసే సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆస్కార్ రేసులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లను దర్శక ధీరుడు రాజమౌళి అద్భుతంగా చూపించారు.

 

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి హీరోల కంటే ఎక్కువగా రాజమౌళికే మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత రాజమౌళి మరో బిగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను విదేశాల్లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఇకపోతే రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నారో కూడా చెప్పేశారు.

 

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు తెలిపారు. రాజమౌళి మహేష్ సినిమాను ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో తీయనున్నట్లు సమాచారం. ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే అది ఏ లెవల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారు.

 

తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి ఇందులో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటించనున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేసే సినిమాలో పవన్, ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. అదే గనుక జరిగితే ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలను తెరపై చూసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి రాజమౌళి మంచి ప్లానే వేశాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -