CM KCR: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. కీలక నిర్ణయం దిశగా కేసీఆర్?

CM KCR: తెలంగాణలో ఇక టీఆర్ఎస్ పేరు ఇక కనిపించే అవకాశాలు ఉండవా? టీఆర్ఎస్ ఇక కనుమరుగైపోతుందా? కొత్త జాతీయ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అవుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెడుతున్న క్రమంలో పై ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. విజయదశమి రోజుల కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. అదే రోజు టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

ముందుగా నేతలకు కొత్త పార్టీ గురించి వివరించనున్నారు. ఆ తర్వాత ముహూర్తం ప్రకారం కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరుతో పాటు ఎజెండాను కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. అయితే పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమతి లేదా భారతీయ రైతు సమితి అని తెలుస్తోంది. అయితే కేసీఆర్ కొత్త జాతీయ పేరు ప్రకటిస్తప ేటీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు పార్టీలు ఉంటే వచ్చ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా లేక కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ తో తీసుకొచ్చారు. తెలంగాణ సాధన కోసం పేరు పెట్టారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగానే టీఆర్ఎస్ ఉంది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పంథా మార్చారు. ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మార్చారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్ తో కొత్త జాతీయ పార్టీని కేసీఆర్ పెడుతున్నారు. కొత్త జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే పేరుతో తెలంగాణ ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీగానే దేశ ప్రజలు గుర్తిస్తారు. దీంతో కొత్త జాతీయ పార్టీ పెడితే దానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ టీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా ఉండలేరు.

దీంతో టీఆర్ఎస్ లో కొత్త జాతీయ పార్టీని విలీనం చేసే అవకాశముంది. ఇక టీఆర్ఎస్ ను పార్టీగానే ఉంచి బీఆర్ఎస్ ను అనుబంధ పార్టీగా చేస్తే ఎలా ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. కొత్త జాతీయ పార్టీ బాధ్యతలు కేసీఆర్ తీసుకుని… టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ ను చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆ పార్టీలో జరుగుతోంది. బీఆర్ఎస్ తెలంగాణలో కాకుండా ఇతర పార్టీలో పోటీ చేస్తే బాగుంటుందనే యోచన కూడా కేసీఆర్ చేస్తున్నారు.

తెలంగాణలో ఎలాగూ టీఆర్ఎస్ ఉంటుంది కనుక ఇతర రాష్ట్రాల్లో కొత్త జాతీయ పార్టీపై పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై కేసీఆర్ కఅక్టోబర్ 5న జరిగే సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నారు. కొత్త జాతీయ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేస్తే ఆ పార్టీ ఇక కనుమరుగైపోతుంది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -