YCP-TDP: 2024 ఎన్నికల సమయానికి వైసీపీకి గట్టి దెబ్బలు తగలనున్నాయా?

YCP-TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే వచ్చే ఎన్నికలలో కూడా అధికార పీఠం తమదేనంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా గత ఎన్నికలలో 151 సీట్లు విజయం సాధించగా ఈసారి వచ్చే ఎన్నికలలో మాత్రం వైసిపి ప్రభుత్వం 175 సీట్లు తప్పనిసరిగా గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కనుక చూస్తుంటే వైసిపి ప్రభుత్వానికి కట్టి షాక్ తగిలినట్టు తెలుస్తుంది.ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇలాంటి షాక్ తగలడం కాస్త కష్టతరం అనిపిస్తుంది.ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి విజయం సాధించగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందింది. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా టిడిపి ప్రభుత్వం ఒక సీటు గెలుపొందిగా ఇది వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ అని చెప్పాలి.

ఇకపోతే వైసీపీ ప్రభుత్వ తీరుతో ఎంతో విసిగిపోయినటువంటి కొందరు ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వీడబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల సమయానికి 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తారని సమాచారం.ఇలా ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ విడబోతున్నారని తెలియడంతో వైసిపి ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇలా ఒకేసారి తమ పార్టీ నుంచి 30 మంది వెళ్లిపోవడంతో పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని జగన్ ఆలోచనలో పడ్డారట.

 

ఇలా ఒకేసారి ఎమ్మెల్యేలు జగన్ కి షాక్ ఇవ్వడంతో ఈయన అయోమయంలో పడ్డారని ఇదే కనుక నిజమైతే తన పార్టీ తిరిగి కోలుకోవడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇక ఒకేసారి 30 మంది ఎమ్మెల్యేలు టిడిపి ప్రభుత్వంలోకి వెళ్లడంతో టిడిపి ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుందని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి వస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై జగన్ ఎలా స్పందిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -