NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకులతో అలా ఉంటారా?

NTR: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. అప్పటివరకు టాలీవుడ్ హీరోలుగా కొనసాగిన వీరిద్దరూ.. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్లుగా ఎదిగారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఎన్టీఆర్ సినిమా స్టోరీల ఎంపిక విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. అతని దగ్గర నిర్మాతలు స్టోరీలు చెప్పడానికి వస్తే.. ఆ స్టోరీ ఎన్టీఆర్‌కు నచ్చకపోతే.. నిర్మోహమాటంగానే వద్దని చెప్పేస్తున్నారట. అంతలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. అయితే గతంలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే.. భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ కెరీర్ పరంగా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో.. ఫ్యామిలీ పరంగా అంతే సాఫ్ట్ గా వ్యవహరిస్తారు. ఎన్టీఆర్‌కు ఇద్దరు పిల్లలనే విషయం తెలిసిందే. ఒకరు ‘నందమూరి అభయ్ రామ్, మరొకరు నందమూరి భార్గవ్ రామ్. ఎన్టీఆర్‌కు నటనతోపాటు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన కొడుకులతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తాడని సమాచారం. అయితే తండ్రీకొడుకులు కలిసి వేరే లెవెల్‌లో డ్యాన్స్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు అభయ్, భార్గవ్ అంటే చాలా ఇష్టమని, అందుకే పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తాడని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -