NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధానిని కలవనున్నారా?

NTR: భారత ప్రధాని మోదీ తన కర్తవ్య నిర్వహణలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఈమధ్యన ఆమె తల్లి హీరాబెన్ మరణించినా ఆ బాధలో కూడా ప్రధాని మోదీ తన విధులకు హాజరయ్యారు. అలాంటి వ్యక్తిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ లో చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆమె తన వందో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

 

గత ఏడాది జూన్‌ 18న హీరాబెన్ వందేళ్లను పూర్తి చేసుకున్నారు. వందేళ్ల వయస్సు ఉన్నా కూడా ఆమె నిన్నమొన్నటి వరకూ చాలా యాక్టివ్‌గా గడిపారు. అయితే కొద్దిరోజుల క్రితం నుంచి మాత్రం ఆమెకు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అహ్మదాబాద్‌ యూఎన్ మెహతా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ భావోద్వేగమయ్యారు. తన తల్లి అంత్యక్రియలను ఎంతో హడావుడి లేకుండా జరిపారు.

 

తన తల్లి పాడె మోసి సాదాసీదాగా అంత్యక్రియలను పూర్తి చేశారు. తన నిరాడంబరతను మోదీ చాటుకున్నారు. మోదీ తల్లి మరణ వార్తతో చాలా మంది ఆయన్ని పరామర్శించారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తాజాగా కొందరు వెళ్లి మోదీని పలకరించారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ప్రధాని మోదీకి చాలా ఇష్టం. ప్రస్తుతం తారక్ విదేశాలలో ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు.

 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇండియాకు వచ్చిన తర్వాత ప్రధాన మంత్రిని కలవబోతున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీ తల్లి చనిపోయిన నేపథ్యంలో తారక్ మోదీని కలిసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోనున్నారని సమాచారం. దీంతో పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

TDP Senior Leaders: టీడీపీలో ఈ 10 మంది సీనియర్ నేతలకు టికెట్ దక్కకపోవడానికి కారణాలివేనా.. ఏం జరిగిందంటే?

TDP Senior Leaders: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను విడుదల చేసి...
- Advertisement -
- Advertisement -