Windows: రైలు బోగీల్లో ఈ తేడాలు గమనించారా? ఇనుప కడ్డీలు అడ్డంగా ఎందుఉంటాయంటే..

Windows: సాధారణంగా మనం రైల్లో ప్రయాణించేటప్పుడు విండో సైడ్‌ సీట్‌ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. బయట ప్రకృతి అందాలను తిలకించడానికి వీలుగా విండో సీట్‌ను ఎక్కువ మంది ప్రిఫర్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అసలు ట్రైన్‌లో విండో దగ్గర ఇనుప కడ్డీలు అడ్డంగానే ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు. నిలువుగా ఎందుకు ఉండవనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..

రైల్లో వెళ్లేటప్పుడు బయట నుంచి ఏవైనా తినుబండారాలు కొనుక్కోవాలనుకుంటే వాటిని మనం రైలు దిగకుండానే కిటికీ ఇనుక కడ్డీల మధ్యలో తేలిగా తీసుకోవచ్చు. సాధారణంగా జైళ్లలో నిలువు ఇనుప చువ్వలు అమర్చి ఉంటారు. అలాగే నిలువు కడ్డీలు అమర్చడం వల్ల అందులో మనం బంధీ అయినట్లు ఫీలింగ్‌ కలుగుతుంది. జైలు చువ్వలు, పక్షుల పంజరాలు, ఇంటి ఫెన్సింగ్‌ లాంటివి నిలువు కడ్డీలతో అమరుస్తారు.

అడ్డంగా కడ్డీలు ఉండటం వల్ల ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా తొందరగా బయట పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిలువు కడ్డీల కంటే అడ్డు కడ్డీలను తొందరగా వంచి ప్రమాద సమయాల్లో తప్పించుకోవచ్చని చెబుతున్నారు. నిలువు కడ్డీల కంటే అడ్డు కడ్డీలే తొందరగా వంగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లలో ఎక్కువగా అడ్డంగా కడ్డీలు అమర్చి ఉంటారు.

ప్రవేశ ద్వారం పక్క విండోకు ఎక్కువ కడ్డీలు..
మరోవైపు రైలు బోగీల్లో ప్రవేశ ద్వారం పక్కనే ఉన్న కిటీకీ చువ్వలు మిగిలిన కిటికీల చువ్వల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ తేడాను చాలా మంది గమనించి ఉండరు. ఇందుకు కూడా కారణాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం దిగిన వెంటనే చాలా మంది దొంగతనాలు చేస్తుంటారు. కిటికీ పక్కనే ఉండటంతో దిగేటప్పుడు ప్రయాణికుల సామాగ్రిని ఎత్తుకెళ్లే అవకాశాలుంటాయి. ఇలాంటి దొంగతనాలను అరికట్టేందుకు రైల్వే శాఖ మెయిన్‌ డోర్‌ పక్కన ఉన్న విండోకు ఎక్కువ కడ్డీలు అమర్చి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -