Winter Foods: అల్లం పాలు చలికాలంలో తాగితే ఎంత మంచిదో తెలుసా?

Winter Foods: ప్రస్తుతం చలి కాలం. చాలా మంది దగ్గు జలుబుతో బాధ పడుతూ ఉంటారు. చలి కాలం అంటేనే సీజనల్ రోగాలకు పెట్టింది పేరు. అదీ కాక ఈ మధ్య కరోనా కి తోడు ఫ్లు కూడా బాగానే విజృంభిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పానీ పూరీకి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టైఫాయిడ్ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.

అల్లం పాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు!

గొంతు నొప్పి గా ఉండటం,దగ్గు ఈ కాలంలో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.వీటికి దూరంగా ఉండాలంటే అల్లం పాలే మనకి శరణ్యం. పాలు బలం. దానికి అల్లం తోడు అయితే జీర్ణ సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు. వేరే కాలంలో అల్లం పాలు తాగినా తగకపోయినా చలికాలంలో మాత్రం ఖచ్చితంగా తాగాలి.

జీర్ణ వ్యవస్థ సరిగా ఉండకపోవడం,రోగనిరోధక శక్తి తగ్గడం చలికాలంలో మామూలే. అల్లం ఈ రెండిటికీ పనిచేస్తుంది. తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణం అవటంలో సహాయం చేస్తుంది. ఎసిడిటీ ఉన్నా కూడా అల్లం తరచుగా వాడాలి. ఇక రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా అల్లం పాలు అద్భుతంగా పని చేస్తుంది. చాలా మంది అల్లం వంటల్లో కూడా వాడుతూ ఉంటారు మంచి టేస్ట్ కోసం.

అయితే ఇవి కాక మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే మనకే మంచిది. చలికాలంలో చిరుతిండ్లు తగ్గించాలి. బయట తినడం కూడా ఎంతగా తగ్గిస్తే అంత మంచిది. వేడి నీళ్ళు తాగాలి. అంతగా వేడి నీళ్ళు తగలేకపోతే. నీళ్ళు కాగబెట్టి వాటిని చల్లార్చి తాగవచ్చు. ఆరోగ్యం విలువ బాగా తెలుసు కాబట్టే మన పెద్ద వాళ్ళు తరచుగా చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యము అని.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -