Delhi: ప్రియురాలితో భర్త హోటల్‌ గదిలో.. సడేన్‌గా భార్య ఎంట్రీ!

Delhi:  నేటి కాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. మగాళ్లతో సమానంగా ఆడవాళ్లు సైతం ఈ దురలవాట్లకు పాల్పడుతున్నారు. పెళ్లైనా కూడా మరో సుఖం కోసం ఆరాటపడి చావు దెబ్బలు తింటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. వారి వారి శరీర సుఖాల కోసం రెండు కుటుంబాల పరువుతో పోవడంతో పాటు వారి పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు. అయితే ఇలా అక్రమ సంబంధం కొనసాగిస్తూ తాజాగా ఓ వ్యక్తి మరో అమ్మాయితో రాసలీలలు జరుపుతుండగా అతడి భార్య వచ్చి ఇద్దరిని చితకబాదిన ఘటన ఢిల్లిలో చోటు చేసుకుంది.

ఢిల్లీ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌ గదిలో భర్త తన ప్రియురాలితో రాసలీలలు కొనసాగిస్తుండగా భార్య వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఒకే గదిలో వారిని చూసే సరికి ఆగ్రహంతో ఊగిపోయి ఇద్దరినీ చెప్పు తీసుకొని చితకబాదింది. ఇంతకు ముందు ఎన్నో అవకాశాలు ఇచ్చా.. అయినా మారలేదా అంటూ తన భర్తను కొడుతూనే ఉంది. ఆగ్రాకు చెందిన ఓ జంటకు పదహారు ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె వయస్సు సుమారు 16 సంవత్సరాలు ఉంటుంది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పలుమార్లు మందలించింది. అంతేకాక అతడిని సంబంధం పెట్టుకున్న మహిళలకు కూడా గట్టిగా మందలించింది.

అయినా వారిద్దరిలో మార్పు రాలేదు. భార్యకు తెలియకుండా వారిపని కానిస్తూ వచ్చారు. అయితే.. ఇలా అయితే కుదరదని భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు బంధువులకు అప్రమత్తం చేసింది. సోమవారం రాత్రి రాజమండి రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న ఓ హోటల్‌కు భర్త తన ప్రియురాలితో వచ్చాడని భార్యకు సమాచారం అందింది. డైరెక్ట్‌గా హోటల్‌ గదికెళ్లి ఇద్దరిని చెప్పులతో చితకబాదింది. ఇద్దరు కలిసి మళ్లీ ఇలాంటి తప్పు చేయామని జోతులు జోడిస్తున్న ఆమె మాత్రం కొట్టడం ఆపలేదు. హోటల్‌ గదిలో భర్తతో పాటు ప్రియురాలిని చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -