Women IPL: ఉమెన్స్ ఐపీఎల్ అప్పుడే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత వినోదం

Women IPL: ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు సక్సెస్‌పుల్‌గా జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత మజా అందిస్తున్నాయి. అత్యంత ఉత్కంఠకరంగా జరిగే మ్యాచ్‌లు అభిమానులను థ్రిల్‌ను అందిస్తున్నాయి. సిక్స్‌లు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతుండగా.. బౌలర్లు మాయజాలం చేస్తూ వికెట్లను పడగొడుతున్నారు. దీంతో ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత వినోదాన్ని అందిస్తోంది.

అయితే గత ఏడాది నుంచి మెన్స్ ఐపీఎల్ తరహాలో ఉమెన్స్ ఐపీఎల్‌ను కూడా బీసీసీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఘనంగా ఉమెన్స్ ఐపీఎల్ జరగ్గా.. ఈ సారి కూడా నిర్వహణకు బీసీసీఐ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది దీపావళి సమయంలో ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. ఐపీఎల్ లాగానే ఇంటా, బయటా ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

కానీ ఒకే ఏడాది రెండు సీజన్లు కాకుండా విభిన్న సమయంలో నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గత ఏడాదిలా మార్చిలో కాకుండా వేరే సమయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహిళ క్రికెట్‌కు కూడా ఇప్పుడు ఆదరణ పెరిగిందని, ప్రత్యేకమైన అభిమాన దళం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. డబ్ల్యూపీఎల్‌ను ప్రోత్సహిస్తే ఆ సంఖ్య పెరుగుతూనే ఉంందన్నారు.

 

ఈ ఏడాది మార్చి 4 నుంచి 26 వరకు రెండు స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. కానీ ఈ సారి దీపావళి సమయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2023 ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు టీమిండియాకు వెళ్లేది లేదని ఇప్పటికే జైషా చెప్పారు. దీంతో టోర్నీ వేదిక మార్పు, పాక్, టీమిండియా మ్యాచ్ ల నిర్వహణపై సభ్య దేశాల అభిప్రాయాల కోసం ఎదురుచూస్తున్నట్లు జైషా చెప్పుుకొచ్చారు. అయితే జైషా ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడుగా కూడా ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -