World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు నేరుగా క్వాలిఫై అయిన జట్లు ఇవే.. మరో స్థానం కోసం పోటీ

World Cup 2023: టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఇప్పుడు అందరి దృష్టి వన్డే ప్రపంచ కప్‌పై పడింది. అభిమానులతో పాటు టీమ్ యాజమాన్యాలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాయి. ప్రస్తుతం టీ20, వన్డే ప్రపంచకప్‌లు ఇంగ్లాండ్ వద్దే ఉన్నాయి. ఎలాగైనా సొంతం చేసుకోవాలని జట్లు ఆరాటపడుతున్నాయి. ఈసారి వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుండటంతో ప్రపంచం దృష్టి ఇక్కడే ఉంది. ఇక్కడ క్రికెట్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఏడు జట్లు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ ఈ జాబితాలో ఉన్నాయి. 134 పాయింట్లతో వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది టీమిండియా. వాస్తవానికి ఆతిథ్య దేశంగా టీమిండియా పాయింట్లతో సంబంధం లేకుండానే నేరుగా క్వాలిఫై అవుతుంది. 18 వన్డేలు ఆడి 125 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. 17 వన్డేలు ఆడి 125 పాయింట్లతో న్యూజిలాండ్ జట్టు మూడో స్థానంలో ఉంది. 18 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా, 120 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు కూడా 120 పాయింట్లు సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్ 14 వన్డేలు ఆడి 115 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.

Men's Cricket World Cup 2023 qualifying matches rescheduled

ఆ జట్లకు నో ఛాన్స్..
వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్ల మధ్య మరో ప్లేస్ కోసం పోటీజరుగుతోంది. ప్రస్తుతం 88 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ గెలిస్తే… వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించగలుగుతుంది. ఐర్లాండ్ 68, శ్రీలంక 67, సౌతాఫ్రికా 59 పాయింట్లతో 9, 10, 11వ స్థానాల్లో ఉండగా ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న జింబాబ్వే 45, నెదర్లాండ్స్ 25 పాయింట్లు సాధించాయి. వీటిల్లో ఐర్లాండ్, శ్రీలంకకు చాలా తక్కువ ఛాన్స్ ఉంది.

షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీకి టీమిండియా రాకపోతే, తాము భారత్‌లో అడుగుపెట్టేది లేదని స్పష్టం చేసింది పీసీబీ. దీంతో వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? మాట మీద నిలబడి, టోర్నీ నుంచి తప్పుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆ జట్టుకు అంత సీన్ లేదని, ఐసీసీ టోర్నీని బాయ్ కాట్ చేసేంత శక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు. భారత్ వెళ్లకపోయినా.. తప్పకుండా పాకిస్థాన్ ఇండియాకు వస్తుందని పేర్కొంటున్నారు.

గతంలో 1987, 1996, 2011 సంవత్సరాల్లో 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను భారత్ నిర్వహించింది. నాలుగోసారి 50 ఓవర్ల ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2011లో భారత్‌లో 50 ఓవర్ల ప్రపంచకప్‌ను నిర్వహించినప్పుడు మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారైనా భారత్ కప్ కొడుతుందేమో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts