Tollywood Directors: టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కానీ ఆ సినిమాలు ఊహించని స్థాయిలో డిజాస్టర్ అవుతాయి. ఇక ఇలాంటి సినిమాలకి పోటీగా ఏదైనా సినిమా వస్తే ఆ సినిమాలు పూర్తిగా ఢీలా పడిపోతాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొడతాయి. ఈ తరహా లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల సినిమాలు కొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మనం వాటి వైపు ఒక లుక్కేద్దాం.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అప్పట్లో భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. అంతకుముందు వచ్చిన అత్తారింటికి దారేది సినిమాను అటు ఇటు తిప్పి ఈ సినిమాను చేసినట్లు అనిపించింది. కనుక ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక శ్రీను వైట్ల అంటే సినిమా పరంగా చాలా నమ్మకాలు ఉంటాయి. కానీ రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా మాత్రం పూర్తిగా ఓటమిపాలైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అంతకుముందు విడుదలైన అతనొక్కడే సినిమా కాన్సెప్ట్ కు దగ్గరగా ఉందని పొట్టి పారేశారు.
అదేవిధంగా డైరెక్టర్ గుణశేఖర్ అప్పట్లో నిప్పు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
ఇక శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అవ్వక ముందు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ అయింది.
బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాకు అప్పట్లో భారీ అంచనాలను పెరిగాయి. ఈ సినిమాలో బోయపాటి మాస్ ఎలిమెంట్ ను కొంచెం ఓవర్ గా చూపించాడు. కాగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.