Hero Venu: హీరో వేణు కెరీర్ నాశనం కావడానికి అసలు రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

Hero Venu: తెలుగు సినీ ప్రియులకు హీరో వేణు గురించి పెద్దగా పరిచయంకర్లేదు. అప్పట్లో కుటుంబ కథ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో నటిస్తూ హీరో గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు వేణు. స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వేణు ఆ సినిమాతోనే హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరో వేణు పలు సినిమాలో నటించినప్పటికీ తనకి అంతగా గుర్తింపు రాలేదు.

కానీ హీరోగా మాత్రం తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు. హనుమాన్ జంక్షన్ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించిన వేణు తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ కొంతకాలం నుంచి వేణు ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇవివి సత్యనారాయణ గారు తనకి ఒక మంచి కథను తీసుకొని వచ్చారని తెలిపాడు.

ఆ కథ నాకు చాలా బాగా నచ్చిందని, నేను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని తెలిపాడు. అదే క్రమంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా లో హీరోగా నటించడానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ నాకు ఆఫర్ చేశారు అని తెలిపాడు. ఈ విషయం గురించి సత్యనారాయణ గారితో చెప్పగా నువ్వు ముందు నా ప్రాజెక్ట్ ఒప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది ఎలా చేస్తావని అడిగాడట. దాంతో వేణు పూరి జగన్నాథ్ స్టోరీ ని వదులుకున్నాడట.

ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ గారి స్క్రిప్ట్ విషయంలో ఏదో తేడా వచ్చి ఆ కథ ను పక్కన పెట్టేసారు. ఇక షూటింగ్ నేపథ్యంలో వేణు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్లితే వేరే స్క్రీప్ట్ ను చెప్పి తన ని బలవంతంగా ఒప్పించారని తెలిపాడు. అది నాకు చాలా బ్యాడ్ సీన్ గా అనిపించిందని వేణు తెలిపాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వేణు కెరీర్ నాశనం అవ్వడానికి కారణం తను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ఒప్పుకోక పోవడమే అని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -