Bunny: వామ్మో.. బన్నీ పారితోషికం లెక్కలు మామూలుగా లేవుగా!

Bunny: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తోంది. ఏ సినిమా చేసినా పాన్ ఇండియా లెవల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి ఇందులో సక్సెస్ అవుతున్నారు. అయితే పాన్ ఇండియా లెవల్లో సినిమా చేయాలంటే అది అంత సులభమైన పద్దతి కాదు. టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా అనేది వస్తోందంటే దానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అదంతా కామన్ అనిపిస్తుంది.

 

తాజాగా పుష్ఫ 2 సినిమా విషయంలో కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పుష్ఫ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో కలెక్షన్లను రాబట్టింది. సినిమా ఆశించినన్ని రోజులు ఆడకపోయినా వసూళ్ల పరంగా బాగానే వచ్చింది. ఇప్పుడు పుష్ఫ2 సినిమా విషయంలో కూడా కొన్ని అంకెలు వింటుంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ అంకెలను చూసి మీరు వావ్ అనకుండా ఉండరు. అంత భారీ మొత్తంలో అంకెలు వినిపిస్తుండటం విశేషం.

 

పుష్ప 2 సినిమాకు బడ్జెట్ నాలుగు వందల నుంచి అయిదు వందల కోట్లు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే కనీసం వంద కోట్లు లాభం రావాలన్నది టార్గెట్ గా ఉంది. హీరో అల్లు అర్జున్ కు ఈ సినిమాలో 100 కోట్ల రెమ్యునరేషన్ కు సంబంధించి అందులో 30 శాతం లాభాల్లో వాటా ఇవ్వాలన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టాగా వినిపిస్తోంది.

 

ఇకపోతే దర్శకుడు సుకుమార్ కు ఈ సినిమాకు సంబంధించి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ లో 30 శాతం లాభాల్లో వాటా ఇవ్వాలన్నది మరో రకంగా వినిపిస్తున్న మాట. ఇక చివరికి ఈ సినిమా పరంగా నిర్మాతలకు 40శాతం వాటా ఉండాలన్నమాట. అంటే ఈ విధంగా చూసుకుంటే తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోబోతున్న హీరోగా అల్లు అర్జునే ఉండనున్నారు. ఎందుకంటే వంద కోట్ల రెమ్యునరేషన్ తో పాటు 30 శాతం వాటా అంటే కనీసం 130 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pareshan Boys: ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. మనమంతా సమానమంటూ?

Pareshan Boys: సాధారణంగా ఇతర దేవులను కొలిచేవారు హిందూ దేవుళ్ళ వద్దకు రారు హిందూ దేవుళ్లను నమస్కరించరు. అలాగే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కూడా వారు తీసుకోరు. ఇలా హిందువులు...
- Advertisement -
- Advertisement -