Assets: వామ్మో.. బాలయ్య అన్ని రూ.కోట్ల ఆస్తులు సంపాదించారా?

Assets: నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యకు ఉన్న మాస్ ఫాలొయింగ్ వేరే లెవల్. మొదటి నుంచి మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. మాస్‌గా బాప్ ఎవరంటే.. బాలయ్య పేరే వినిపిస్తుంది. విశ్వనటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ఇప్పటివరకు ఇండస్ట్రీయల్ హిట్ సినిమాలు అందించారు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫుల్ జోష్ కనబరుస్తున్నారు. ఇన్ని రోజులవరకు బాలయ్యలో సీరియస్ యాంగిల్ చూసిన ప్రేక్షకులు.. అతడిలో కామెడీ యాంగిల్ కూడా పరిచయం చేశాడు. అన్‌స్టాపబుల్ షో ద్వారా బాలయ్య.. జనాలకు మరింత దగ్గర అయ్యాడు. సీజన్-1 సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. సీజన్-2 విజయవంతంగా రన్ అవుతోంది.

 

 

షోలో స్టార్ హీరోలను, పొలిటికల్ లీడర్లతో ఇంటర్వ్యూలో చేస్తూ.. బాలయ్య సందడి చేశారు. కెరీర్ ప్రారంభం బాలయ్య పెద్దగా ఏం సంపాదించుకోలేదనే చెప్పుకోవచ్చు. నిర్మాతలకు ఫేవర్‌గా ఉండాలని తన తండ్రి చెప్పిన మాటలకు కట్టుబడి.. పెద్దగా సంపాదించుకోలేదు. సినిమా హిట్ అయినా.. రూ.8 కోట్ల వరికే పారితోషికం తీసుకునేవాడని సమాచారం. కానీ ప్రస్తుతం బాలయ్య కెరీర్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వరుస సినిమాలు, షో ద్వారా బాలయ్య బాగానే సంపాదించుకున్నారు. దీంతో బాలయ్య ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

 

బాలయ్య ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. బంజారాహిల్స్ లో రూ.30కోట్లు విలువ చేసే ఓ ఇల్లు ఉంది. అలాగే ఆయన వద్ద రూ.12 కోట్ల విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. అలాగే 300 క్యారెట్ల వజ్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. బాలయ్య కొడుకు, భార్య పేర్లతో పలు కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయని సమాచారం. బాలయ్య మొత్తం ఆస్తి వివరాలు దాదాపు రూ. 1200 కోట్లకు పైగానే ఉంటుందని సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య సంపాదనను చాలా వరకు ఫౌండేషన్ల కోసం ఖర్చు చేస్తారట. ఇప్పటికే హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రితో ఎంతో మంది క్యాన్సర్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -