Clove: వామ్మో.. లవంగంకు ఇంత పవర్ ఉందా.. అలా పని చేస్తుందా?

Clove: మనం వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల వల్ల ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఒకటి. లవంగాలు రుచికి ఘాటుగా ఉన్నప్పటికీ వీటినీ ఉపయోగించి చేసిన వంట ఎంతో రుచిగా , సువాసగా ఉంటుంది. వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా ల‌వంగాలు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ల‌వంగాల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. అలాగే ల‌వంగాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని చప్ప‌రిస్తూ న‌మిలి తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది నిద్ర‌లేమి సమస్యతో బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక ల‌వంగాన్ని నోట్లో వేసుకుని చప్పరించి నమిలి తిన‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి నిద్ర‌ బాగా ప‌డుతుంది.

 

లవంగాలను తినటం వల్ల దంతాల నొప్పి సమస్యలు కూడా నివారించవచ్చు. ముఖ్యంగా అందరినీ ఎక్కువగా వేదిస్తున్న అధిక బరువు సమస్యను కూడా లవంగాల వల్ల తగ్గించవచ్చు . ఇందుకోసం రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.ప్రతిరోజు రెండు ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరిగి సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

 

అంతే కాకుండా అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా అరికట్టవచ్చు. అలాగే ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా లవంగాలలో ఉండే క్యాల్షియం ఎముక‌లు ధృడంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన లవంగాలను ప్రతిరోజు ఉదయం చ‌ప్ప‌రిస్తూ నమిలి తిన‌డం వ‌ల్ల ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -