Corona virus:వామ్మో.. కరోనా వైరస్ కేసులు ఏకంగా ఈ రేంజ్ లో పెరిగాయా?

Corona virus: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి చాప కింద నీరులా వ్యాపిస్తూ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. ఒకవైపు రోజులో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండగా మరోవైపు అదే స్థాయిలో మరణాల సంఖ్య కూడా నమోదు అవుతోంది. ఇతర దేశాల సంగతి పక్కన పెడితే భారతదేశంలో కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.

భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 2,151 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య‌ శాఖ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ గా ఉండే కేసుల సంఖ్య 11, 903 కు చేరింది. అలాగే మహారాష్ట్ర లో ముగ్గురు, కేరళ లో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,30,848 గా నమోదైంది.

 

అయితే గత ఏడాది అక్టోబర్ తరువాత ఒక్కరోజులో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే అని ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌ 28వ తేదీన 2,208 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. క‌రోనా టెస్టులు పెంచాల‌ని కేంద్రం ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను ఆదేశించింది. మరోవైపు దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 4,47,09,676కి చేరింది. అలాగే ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,66,925 చేరుకుంది.

 

ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా అని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కరోనా కు సంబంధించిన సలహాలు సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అయితే గడిచిన రెండే మూడు ఏళ్ళలో ప్రపంచం మొత్తాన్ని గడగడలాలించిన కరోనా మహమ్మారి మరొసారి కోరలు చాస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -