Alia Bhatt: వామ్మో.. హీరోయిన్ అలియా క్యారెక్టర్ ఇలాంటిదా?

Alia Bhatt: సినీ ఇండస్ట్రీలో సంబంధాలపై వార్తలు సాధారణం. అయితే ఇలాంటి వార్తలు బాలీవుడ్ లో మరీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఎఫైర్లు, లవ్వులు, సహజీవనాలు చాలా సాధారణం. బాలీవుడ్ ముద్దుగుమ్మలు, గ్రీకువీరులు బాహాటంగానే ఈ విషయాలను ప్రకటిస్తారు కూడా. ఇక పెళ్ళికి ముందే డేటింగ్స్, ఆ తర్వాత వేరే వారితో పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కుదిరినన్ని రోజులు కలిసి ఉండడం, ఆ తర్వాత సున్నితంగా విడిపోవడం బాలీవుడ్ తారలకు అలవాటే.

 

ఇలాంటి వార్తల విషయాల లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది బాలీవుడ్ అగ్రతార అలియా భట్. అప్పట్లో ఈ భామ చాలానే అఫైర్లు నడిపించింది. చాలా తక్కువ సమయంలోనే గొప్ప స్టార్ గా ఎదిగింది అలియా. దాదాపుగా అందరు పెద్ద హీరోలతోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. తన నటనకు కూడా చాలా మంచి మార్కులే సంపాదించింది. ఇలా కొంతమంది పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు వాళ్లతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చేవి. ఇలా ఎన్నో వార్తలు వచ్చినా రణబీర్ కపూర్ ని సెట్ చేసుకుంది అలియా భట్.

 

అయితే పెళ్లికి ముందే అలియా – రణబీర్ చెట్టాపట్టాలేసుకు తిరిగేవారు. చాలాకాలం సహజీవనం తర్వాత.. వీరు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడి అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్ళైన వెంటనే ఒక వార్త వైరల్ అయ్యింది. అదే తాను పెళ్ళి తర్వాత కొన్ని రోజులకే ప్రెగ్నెంట్ అని తెలియడం. అందరూ ఆశ్చర్యపోయేలా పెళ్లైన రెండు నెలలకే అలియాకు మూడు నెలల గర్భవతి తెలిసింది. ఇక ఈ విషయం వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా అలియా ఇటీవల ఈ విషయంపై చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారాయి.

 

ఇటీవల అలియా మాట్లాడుతూ.. “పెళ్లయిన కొన్ని రోజులకే నేను ప్రెగ్నెంట్ అన్న వార్త తెలిసింది. ఆ సమయంలో నేనో భారీ ప్రాజెక్టుకి కమిట్ అయి ఉన్నా. అయితే ప్రారంభంలోనే ప్రెగ్నెంట్ అని తెలియడంతో చిత్ర బృందం నా ఆరోగ్యం పట్ల చాలా కేర్ తీసుకొని రిస్కీ షార్ట్స్ చేశారు. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ సాధారణం” అని సింపుల్ గా చెప్పేసింది. అలియా ఇలా మాట్లాడడంతో బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి.. మరింత ట్రెండ్ చేసింది. ఇక అలియా మరీ బోల్డ్ గా మాట్లాడిందంటూ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -