Prashant Neel: వాయమ్మో.. ప్రశాంత్ నీల్ ఏకంగా అలా చూపించబోతున్నారా?

Prashant Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది దర్శకులకు ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన హీరో అయ్యాడు. ఓటమితో ఉండే డైరెక్టర్లను స్టార్లుగా మార్చాడు. అందుకే తారక్ ను అందరూ లక్కీ అంటారు. ఈ మధ్యనే తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో గోండు జాతి భీమ్ గా అందర్నీ అలరించారు. ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

 

ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. అనేక అవార్డులను కైవశం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించారు. తారక్ ఈ సినిమా పలికే హావభాావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాను డైరెక్ట్ చేసి దర్శక ధీరుడు రాజమౌళికి సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇద్దరు హీరోలతో సినిమాను ఆయన అద్భుతంగా తెరకెక్కించారు.

 

రాజమౌళి సినిమా తర్వాత తారక్ తన 30వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం తారక్ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్ లో ఉండటం వల్ల సినిమా గురించి అప్ డేట్ ఇంకా రాలేదు. అయితే త్వరలోనే కీలక అప్ డేట్ రానుంది. ఇదిలా ఉండగా కొరటాల, తారక్ కాంబో తర్వాత మరో అద్భుత ప్రాజెక్ట్ ను తారక్ చేయనున్నాడు. ఎన్టీఆర్ ప్రముఖ కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాా చేయనున్నారు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ తన సినిమాలో కొంత సమయం పాటు ప్రధానమంత్రి రోల్ లో చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలోని సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉన్నాయని, అవి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -