Sreeleela: వామ్మో.. శ్రీలీల ఖాతాలో ఏకంగా ఇన్ని సినిమాలు ఉన్నాయా?

Sreeleela: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీకాంత్ తనయుడు, రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇచ్చింది. విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను అందుకున్న శ్రీ లీల తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ లలో అతి తక్కువ సమయంలో భారీగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో శ్రీ లీల కూడా ఒకరు. ఇకపోతే ఇటీవల శ్రీలీల ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరొక హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీ లీల అప్కమింగ్ మూవీస్ కి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. శ్రీ లీల ఏకంగా ఏడు ఎనిమిది సినిమాలకు సైన్ చేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి శ్రీ లీల ఏ ఏ సినిమాలలో నటిస్తోంది అన్న విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తన 28వ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో శ్రీ లీల ఒక కీలకపాత్రలో నటించనుంది.

ఇందులో బాలకృష్ణ కూతురి పాత్రలో నటించిన ఉంది అంటూ ఇప్పటికే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. తాజాగా శ్రీలీల ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది. అలాగే శ్రీ లీల నితిన్ నటిస్తున్న తన 32వ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వక్కంతం వంశీ ఆ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే హీరో వైష్ణవ్ తేజ్, శ్రీకాంత్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే బోయపాటి రామ్ పోతినేని కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రోజు సినిమాలో అదేవిధంగా వారాహి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న జూనియర్ అనే సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. అలా శ్రీ లీల ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా ఎనిమిది సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఏడాది వచ్చే ఏడాది వరుస సినిమాలలో నటిస్తూ శ్రీ లీల ఫుల్ బిజీబిజీగా ఉంటుందని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -