Sunitha: వామ్మో.. స్టార్ సింగర్ సునీత భర్త రేంజ్ ఇదే!

Sunitha: టాలీవుడ్ లో చాలా మంది సింగర్లు ఫేమస్ అయ్యారు. కొందరికీ విపరీతమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ సునీతకు చాలా పేరుంది. ప్రస్తుతం మ్యాంగో మీడియా అధినేత అయిన రామ్ వీరపనేనిని సింగర్ సునీత పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. రామ్ వీరపనేని బ్యాక్ గ్రౌండ్ చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

 

సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని అసలు పేరు రామకృష్ణ వీరపనేని అని చాలా మందికి తెలీయదు. ఆయన విదేశాలలో ఉన్నత చదువులు చదివారు. దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయన సెటిల్ అయ్యారు. ఇకపోతే విదేశాలలో ఆయనకు చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో వాటికి సంబంధించి వందల కోట్ల షేర్లు ఆయనకు ఉన్నాయి. వాటితో పాటుగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ అయిన మ్యాంగో మీడియాకి ఆయన సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

ఇకపోతే మ్యాంగో మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళ, హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలను ఆయన డబ్బింగ్ రైట్స్ తీసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా ఆయనకు భారీగా డబ్బులు వస్తున్నాయి. ఇవే కాకుండా హైదరాబాద్‌లో పెద్దపెద్ద బిల్డింగ్స్ తో పాటు అపార్ట్మెంట్స్ కూడా ఆయన కలిగి ఉన్నాడు.

 

రామ్ వీరపనేనికి తన తండ్రి వారసత్వంగా కూడా కొన్ని కోట్లు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే రామ్ వీరపనేని కోట్లకు అధిపతి అని ఎవ్వరికీ తెలీదు. సింగర్ సునీత నిజంగా రామ్ వీరపనేనిని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగపెట్టడం నిజంగా మంచి విషయమని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -