Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ కాదు పన్నీరు సెల్వం.. రాజమౌళి కజిన్ సంచలన వ్యాఖ్యలు!

Ponniyin Selvan: తెలుగు సినీ ప్రియులకు తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు కోలీవుడ్ మీడియా, కోలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా బాహుబలిని మించి ఉంటుందని ఉబ్బి పోయారు. మరికొందరైతే బాహుబలా బొక్కా అన్నట్లు మాట్లాడారు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు కూడా కౌంటర్ ఇచ్చారు. కొన్ని కోట్లు క్రాస్ చేసిన బాహుబలి సినిమాకు ఈ సినిమాకు పోలిక ఎక్కడైనా ఉందా అన్నట్లు దెప్పి పొడిచారు. ఇక ఈ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు మణిరత్నం బాహుబలి సినిమాను కాపీ కొట్టాడు అని అంటున్నారు.

ఈ సినిమాలో పలు సన్నివేశాలు బాహుబలి ని పోలి ఉన్నట్లు అనిపిస్తున్నాయి అని తెలియజేశారు. ఇక పాత్రల విషయంలో కూడా బాహుబలిని పోలి ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సహ రచయిత రాజమౌళి కజిన్ అయినటువంటి కాంచీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసాడు. ప్రస్తుతం కాంచీ చేసిన ఈ ట్వీట్ పొన్నియన్ సెల్వన్ మూవీ ను కించపరిచే విధంగా మారింది.

ఇంతకు కాంచీ చేసిన ఆ ట్వీట్ ఏమిటంటే పొన్నియన్ సెల్వన్ సినిమాను పన్నీరు సెల్వం అంటూ ట్వీట్ చేసాడు. ఇతడు ఇలా చేయడానికి కారణం గతంలో కోలీవుడ్ ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ విషయంలో బాహుబలి సినిమాను తీసి పారేసినట్టు మాట్లాడారు. దానికి అసహనం వ్యక్తం చేసి కాంచీ ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇండస్ట్రీలో పెద్ద రచ్చని సృష్టించే విధంగా మారింది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -