Yadamma Raju: యాదమ రాజుపై దారుణంగా ట్రోలింగ్.. ఏమైందంటే?

Yadamma Raju: ‘పటాస్’ షో ఎంత పాపులరో తెలిసిందే. ప్రముఖ టెలివిజన్ చానల్ లో ప్రసారమయ్యే ఈ షోతో పలువురు కమెడియన్లు మంచి క్రేజ్ సంపాదించారు. తమదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో కమెడియన్ యాదమ రాజు ఒకరు. ఆయన త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమిస్తున్న ఆయన.. పెద్దలను పెళ్లికి ఒప్పించారు.

 

యాదమ రాజు ‌– స్టెల్లాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వాళ్లిద్దరి పేరెంట్స్ దగ్గరుండి ఈ వేడుకను జరిపించారు. కుటుంబసభ్యులతోపాటు బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. దీంతో వీళ్ల ప్రేమ కథ సుఖాంతం అయ్యిందనే చెప్పాలి.

 

అయితే కొందరు మాత్రం యాదమ రాజు నిశ్చితార్థ ఫొటోలు చూసి తెగ కుళ్లుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసి కపటంతో రెచ్చిపోతూ.. అనవరసమైన వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ నిశ్చితార్థం ఫొటోల్లో పెళ్లి కూతురు స్టెల్లా‌కు నుదిటిపై బొట్టు లేదని కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు.. యాదమ రాజు హిందువు, స్టెల్లా క్రిస్టియన్‌ కావడంతో.. ఒకమ్మాయి కోసం మతం మారావని కొందరు పోస్టులు పెడుతున్నారు. సిగ్గు లేదా, ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటున్నావంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

కందకు లేని దురద.. కత్తిపీటకు ఎందుకు?

ప్రేమించుకున్న యాదమ రాజు, స్టెల్లా బాగానే ఉన్నారు. వారి పెళ్లికి ఒప్పుకున్న ఇంటి పెద్దలు కూడా మంచిగానే ఉన్నారు. వాళ్లు తమ ఇష్టంతో మతం మారినా, పెళ్లి చేసుకున్నా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకున్నారు. పిల్లల ఇష్టాన్ని వద్దనుకుండా వారిద్దరికీ పెళ్లి చేస్తున్నారు. అలాంటప్పుడు మధ్యలో ఈ మతం పిచ్చోళ్లకు ముఖానికి బొట్టులేదు, మతం మారిపోయావా అంటూ ఎందుకు కామెంట్లు పెడుతున్నారని ఇంకొందరు నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. కందకు లేని దురద.. కత్తిపీటకెందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ కొత్త జంటకు విషెస్ చెబుతూ యాదమ రాజు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, యాదమ రాజు- స్టెల్లాలు చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరైనా వాళ్ల మనసులు కలిశాయి. ఆ బంధాన్ని మరింత బలం చేసుకుంటూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. తన ప్రేయసిని రెండేళ్ల కిందే ప్రేక్షకులకు పరిచయం చేశాడు యాదమ రాజు. 2020, ఆగష్టు 22న జీ–తెలుగులో ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే హాస్య కార్యక్రమంలో తన కాబోయే భార్యను యాదమ రాజు అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -