Yamuna: బెంగళూరులో యమున పట్టుబడటం వెనుక ఇంత కథ జరిగిందా?

Yamuna: సినిమా అంటే రంగుల ప్ర‌పంచం ఇక్క‌డ రానించాల‌ని ఎంతో మంది క‌ల‌లు కంటారు. అయితే ఆ రంగుల వెన‌క ఎన్నో బాధ‌లు కూడా ఉంటాయి. ఆఫ‌ర్ లు వ‌స్తూ చేతి నిండా డ‌బ్బులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు కానీ ఎలాంటి ఆఫ‌ర్ లు లేక‌పోతే మాత్రం ఎలాంటి ప‌నులైనా చేయాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కొంత‌మంది హీరోయిన్ లు కూడా మొద‌ట సినిమాల్లో రాణించాల‌ని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి అవ‌స‌రాల కోస‌మో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో వ్య‌భిచారం చేసేందుకు కూడా సిద్దమ‌య్యారు. అంతే కాకుండా ప‌ట్టుబ‌డ‌టంతో వారి జీవితాలే తారుమారు అయ్యాయి. అలా వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డి జీవితాల‌ను నాశ‌నం చేసుకున్నారు. అలాంటి ఆరోపణలు వచ్చిన వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ యమున కూడా ఒకరు.

 

1990 దశకంలో యమున అగ్రహీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఉండేది. మౌన పోరాటం సినిమా తర్వాత ఆమె అగ్రస్థానానికి చేరింది. దీంతో భారీగా అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె బుల్లితెరలో సీరియల్స్ వైపు మొగ్గు చూపింది. ఈటీవీలో వ‌చ్చిన విధి సీరియ‌ల్లో ఆమె లేడీ విల‌న్‌గా చేసిన న‌ట‌న అదిరిపోయింది. బుల్లితెర జ‌నాలంతా కేవ‌లం య‌మున విల‌నిజం చూసేందుకే టీవీల‌కు అతుక్కుపోయేవారు.

 

ఇలా సాఫీగా సాగిపోతున్న ఆమె కెరీర్‌లో ఓ పెద్ద ఘటన చోటుచేసుకుంది. 2011వ సంవ‌త్స‌రంలో య‌మున బెంగుళూరులోని ఓ స్టార్ హోట‌ల్ లో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డింది అంటూ వార్త‌లు రావడం పెద్ద సంచలనంగా మారింది. ఆమెతో పాటు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు గా వార్త‌లు వినిపించాయి. ఆ తర్వాత ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో తాను ఏ తప్పూ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది.

 

ఆ ఘటన తర్వాత చనిపోవాలనుకున్నాను: యమున
తాను ఆ రోజు హోటల్‌కు వెళ్ల‌నే లేద‌ని, సీసీపీ ఆఫీసుకు వెళ్లాన‌ని యమున చెప్పింది. తన గురించి అబద్ధాలు ప్రచారం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ వార్త‌లు రావ‌డంతో తాను చ‌నిపోవాల‌ని అనుకున్న‌ట్టు చెప్పింది. దీనివల్ల త‌న పిల్ల‌లకు చెడ్డ‌పేరు రాకుండా ఉంటుంద‌ని భావించానని చెప్పింది. కానీ చ‌నిపోతే నీ పిల్ల‌ల ప‌రిస్థితి ఏంటి అంటూ త‌న స్నేహితులు అన్నారని అందుకే ధైర్యం తెచ్చుకుని బ్ర‌తికి ఉన్నాన‌ని తెలిపింది. నిజం ఎప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు తెలియాల‌ని అందుకే చెబుతున్నానని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఈటీవీలోనే మౌన పోరాటం సీరియల్‌లో నటిస్తోంది.

 

కాగా, యమున తరహాలోనే సుకన్య, వినీత, కిన్నెర, భువనేశ్వరి, శ్వేతాబసు ప్రసాద్, జ్యోతి తదితర ఆర్టిస్టులు కూడా వ్యభిచారం చేస్తూ దొరికిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -