Yashoda: ఆరోజు నుంచి యశోద మూవీ స్ట్రీమింగ్ కానుందా?

Yashoda: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన తాజా చిత్రం యశోద. హరీ, హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 11న విడుదలైంది. సమంత మార్క్‌ మూవీగా పేరు తెచ్చుకుంది. కేవలం సమంత స్టార్‌డమ్‌ ఆధారంగానే కాస్త బడ్జెట్‌ ఎక్కువైనా నిర్మాత వెనుకాడలేదని అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే విడుదల అనంతరం కూడా కలెక్షన్లు కాస్త బెటర్‌గానే వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

 

యశోద మూవీలో లేడీ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్‌ చేసింది సమంత. సరోగసీ పద్ధతిలో గర్భం ధరించిన మహిళగా సమంత నటించింది. ప్రెగ్నెంట్ లేడీ గా యాక్షన్ చూపించిన సమంత.. ఈ సినిమాలో అండర్ కవర్ పోలీస్‌గా స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఆ ప్రాసెస్‌లోనే సమంత విలన్లతో ఫైట్స్ చేసింది. యాక్షన్‌ ఫైట్స్‌లో సాహసంగా నటించిన సమంత ఈ మూవీతో హిట్‌ అందుకుంది.

 

ఇటీవల తాను అరుదైన మయోసైటిస్‌ జబ్బుతో బాధపడుతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల అనంతరం కాస్త గడ్డు కాలం ఎదుర్కొంటున్న సామ్‌.. తర్వాత ఆ ఘటన నుంచి కోలుకొని ఇప్పుడు సినిమాలతో బిజీగా మారింది. ఈ క్రమంలో యశోద మూవీ షూటింగ్‌లో పాల్గొంది. తర్వాత రిలీజ్‌ అయ్యే క్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంది. తర్వాత యశోద మూవీ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చింది.

 

ఓటీటీ స్ట్రీమింగ్‌ అక్కడే..
పాన్ ఇండియా మూవీగా వచ్చిన యశోద మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. యశోద సినిమా కలెక్షన్స్ పరంగా, సమంత స్టామినాతో మంచి స్కోర్‌నే నమోదు చేసిందని నిపుణులు చెబుతున్నారు. థియేటర్స్‌లో హిట్ అనిపించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీకి ఎక్కనుంది. యశోద డిజిటల్ రైట్స్‌ను మంచి డీల్ తో అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Related Articles

ట్రేండింగ్

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ...
- Advertisement -
- Advertisement -